You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డోనల్డ్ ట్రంప్ తీవ్ర అనారోగ్యానికి గురైతే.. పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయి?
- రచయిత, రియాలిటీ చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలకు సరిగా ఒక్క నెల ఉందనగా ట్రంప్‌కు కరోనావైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. అయితే.. తరువాత ఏం జరగబోతోందనే దానిపై అనేక సందేహాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ట్రంప్‌కు కోవిడ్ 19 పాజిటివ్ అని నిర్థారణ అయిన రోజు అంటే అక్టోబర్ 1 నుంచీ 10 రోజుల పాటు ఆయన క్వారంటీన్‌లో ఉండాలి. కాబట్టి అక్టోబర్ 15న జరగబోయే తదుపరి డిబేట్‌లో ట్రంప్ పాల్గొనే అవకాశాలున్నాయి.
శుక్రవారం ఫ్లోరిడాలో జరగాల్సిన ఒక ర్యాలీని రద్దు చేశారు. దీనికి బదులుగా, "వయో వృద్ధులకు కోవిడ్-19 సహాయంపై ఫోన్ కాల్ కార్యక్రమం" ఉంటుంది.
ఈ సమయంలో, ప్రచారంలో భాగంగా షెడ్యూల్ చేసుకున్న మిగతా ర్యాలీలు కూడా రద్దు చెయ్యాల్సి ఉంటుంది లేదా వాయిదా వేయాల్సి ఉంటుంది.
ఏ పరిస్థితుల్లో ఎన్నికలు ఆలస్యం కావొచ్చు?
ట్రంప్ క్వారంటీన్‌లో ఉండాల్సి రావడం వల్ల వారి ప్రచారాల్లో ఆటంకం వస్తుంది.
అయితే, ఎన్నికలు ఆలస్యం అయ్యే పరిస్థితి వస్తుందా? అనేది ఇప్పుడున్న పెద్ద ప్రశ్న.
అమెరికా చట్టాల ప్రకారం, నాలుగేళ్లకొకసారి, నవంబర్‌లో వచ్చే మొదటి సోమవారం తరువాత వచ్చే మంగళవారం నాడు అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఆ లెక్క ప్రకారం ఈ ఏడాది నవంబర్ 3 న ఎన్నికలు జరగనున్నాయి.
అయితే, ఎన్నికల తేదీని మార్చే హక్కు యూఎస్‌లోని చట్టసభ సభ్యులకు ఉంటుంది కానీ అధ్యక్షుడికి ఉండదు.
ఎన్నికల తేదీని మార్చాలంటే కాంగ్రెస్ ఉభయ సభల్లోనూ మెజారిటీ సభ్యుల ఆమోదం ఉండాలి. అయితే, దీనికి డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల అంగీకారం కూడా ఉండాలి కాబట్టి తేదీని మార్చడం అసంభవంగా తోస్తోంది.
ఒకవేళ ఎన్నికల తేదీ వాయిదా పడినా కూడా, అమెరికా రాజ్యాగం ప్రకారం ఏ ప్రభుత్వ పాలన అయినా నాలుగేళ్లు మాత్రమే కొనసాగాలి కాబట్టి 2021 జనవరి 20 మధ్యహ్నానికల్లా ట్రంప్ అధ్యక్ష పదవినుంచీ వైదొలగాల్సి ఉంటుంది.
ఎన్నికల తేదీని మార్చడానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. ఈ సవరణను మూడింట రెండొంతుల యూఎస్ చట్టసభ సభ్యులు లేదా రాష్ట్ర స్థాయి శాసనసభ సభ్యులు ఆమోదించవలసి ఉంటుంది. తరువాత మూడొంతుల అమెరికా రాష్ట్రాల అంగీకారం కూడా కావలసి ఉంటుంది. ఇది కూడా అసాధ్యం అనిపిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అశక్తుడైతే ఏమవుతుంది?
ప్రస్తుతానికి ట్రంప్‌కు తేలికపాటి కరోనావైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లైతే, అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణ ప్రకారం, అమెరికా ఉపాధ్యక్షునికి పాలనా బాధ్యతలు అప్పగిస్తారు. అంటే మైక్ పెన్స్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ట్రంప్ పూర్తిగా కోలుకున్నాక తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపడతారు.
అయితే, అధ్యక్షుడు కోలుకోలేనంత అనారోగ్యానికి గురైతే క్యాబినెట్ మంత్రులు, ఉపాధ్యక్షుడు కలిసి ట్రంప్ అధ్యక్షునిగా కొనసాగలేరని నిర్ణయించవచ్చు. తరువాత మైక్ పెన్స్ అధ్యక్షుడిగా పూర్తి బాధ్యతలను స్వీకరిస్తారు.
మైక్ పెన్స్ కూడా అధ్యక్షునిగా సారథ్యం వహించలేని పరిస్థితుల్లో ఉంటే అధ్యక్షుడి వారసత్వ చట్టం కింద స్పీకర్ నాన్సీ పెలోసి ఆ బాధ్యతలను తీసుకుంటారు.
ఆవిడ కూడా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించలేని స్థితిలో ఉంటే సీనియర్ రిపబ్లికన్ సెనేటర్ అయిన చార్లెస్ గ్రాస్లీకు ఈ బాధ్యతలు అప్పగిస్తారు.
ఇలా ఇంతకు ముందెప్పుడైనా జరిగిందా?
1985లో అప్పటి అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ క్యాన్సర్ కారణంగా ఆస్పత్రిలో ఉన్నప్పుడు, ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ తాత్కాలికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
2002, 2007లలో అధ్యక్షుడు జార్జ్ బుష్ కోలొనోస్కోపీ పరీక్షలు చేయించుకున్న కాలంలో కూడా ఆయన ఉపాధ్యక్షుడు తాత్కాలిక పదవీ బాధ్యతలను చేపట్టారు.
ట్రంప్ పోటీ చేయలేకపోతే ఆయన స్థానంలో ఎవరొస్తారు?
ఇలాంటి సందర్భాలలో, రిపబ్లికన్ పార్టీ నిబంధనల ప్రకారం, రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్‌సీ)లోకి 168 సభ్యులూ ఓటింగ్ ప్రకారం అభ్యక్ష పదవికి కొత్త అభ్యర్థిని ఎన్నుకుంటారు. మైక్ పెన్స్‌ను కూడా అభ్యర్థిగా ఎన్నుకునే అవకాశాలు ఉంటాయి.
మైక్ పెన్స్ అధ్యక్ష పదవికి అభ్యర్థిగా ఎన్నికైతే ఉపాధ్యక్ష పదవికి మరొకరిని ఎన్నుకుంటారు.
అయితే, ఇంతవరకూ అధ్యక్ష పదవికి మరొకరిని ఎన్నుకోవాల్సిన సందర్భం రిపబ్లిక్ పార్టీకిగానీ, డెమొక్రటిక్ పార్టీకిగానీ తారసపడలేదు.
ముందే వేసిన ఓట్ల మాటేమిటి?
ఈ అంశమే అనిశ్చితిని రేకెత్తిస్తుందని నిపుణులు అంటున్నారు.
ఎందుకంటే ఇప్పటికే లక్షల వోటర్లు తమ వోటును పోస్టల్ ద్వారా పంపించేసారు. కొన్ని రాష్ట్రాల్లో నేరుగా ఓటు వేసే ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది.
బహుశా అశక్తుడైన అభ్యర్థి పేరుతోనే ఓటింగ్ కొనసాగవచ్చని ఐర్విన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రిక్ హాసెన్ అభిప్రాయపడ్డారు.
"ఏది ఏమైనా సరే, బ్యాలట్‌లో దాదాపు ట్రంప్ పేరే ఉంటుందని" లా ప్రొఫెసర్ రిచర్డ్ పైల్డ్స్ అభిప్రాయపడ్డారు.
అభ్యర్థి పేరు మార్చాలంటే రిపబ్లికన్ పార్టీ, కోర్టు ఆర్డర్ తీసుకు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ అందుకు తగినంత సమయం లేదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘బాత్రూం వద్ద మాటువేసి నాపై లైంగిక దాడి చేశారు’ - ట్రంప్‌పై మాజీ మోడల్ ఆరోపణలు
- హాథ్రస్ కేసు: ఆమె నాలుక తెగడం, వెన్నెముక విరగడం... అన్నీ అబద్ధాలా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- పదేళ్ల వయసులో ఇల్లొదిలి వెళ్లాడు.. ఎన్నో కష్టాలు పడ్డాడు.. ఇప్పుడు రూ. 2.4 కోట్లకు ఐపీఎల్లో ఆడుతున్నాడు
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణాసియాలో శాంతి అసాధ్యం: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)