You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పోర్ట్‌లాండ్ నిరసనలు: రెండు వర్షాల ఘర్షణల సమయంలో కాల్పులు.. ఒకరి మృతి - BBC Newsreel
అమెరికాలోని ఆరెగన్ రాష్ట్రం పోర్ట్‌లాండ్‌లో 'బ్లాక్ లైవ్స్ మేటర్' నిరసనకారులు, అధ్యక్షుడు ట్రంప్ మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల సమయంలో ఒకరు మరణించారు.
ఇప్పటికే అక్కడ బ్లాక్ లైవ్స్ మేటర్ నినాదంతో నిరసనలు జరుగుతుండగా ట్రంప్‌కు మద్దతుగా కొందరు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల సమయంలో ఒకరిని కాల్చి చంపారు.
అయితే, పోలీసులు మాత్రం ఈ కాల్పులకు, ఘర్షణలకు సంబంధం ఉన్నదీ లేనిదీ ఇంకా స్పష్టం చేయలేదు.
ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలలో ఒక శ్వేతజాతీయుడిని వైద్యులు కాపాడే ప్రయత్నం చేయడం కనిపించింది.
గత కొన్నివారాలుగా పోర్ట్‌లాండ్‌లో నిత్యం నిరసనలు జరుగుతున్నాయి.
ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ ఒక పోలీస్ అధికారి చేతిలో మరణించిన తరువాత పోలీసు జులం, జాతి వివక్షకు వ్యతిరేకంగా ఇక్కడ నిరసనలు జరుగుతున్నాయి.
పోర్ట్‌లాండ్‌లో తుపాకీ కాల్పుల శబ్దం వినిపించడంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారని.. ఒక వ్యక్తి గాయపడి కనిపించాడని.. వైద్య సహాయం అందించారని, అయితే, ఆయన చనిపోయాడని పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
స్వీడన్: ఖురాన్‌ను తగలబెట్టిన అతివాద గ్రూప్.. ఆందోళనలతో అట్టుడికిన మాల్మో నగరం
ఓ అతివాద గ్రూప్ ఖురాన్‌ను తగలబెట్టడానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ఆందోళనలతో స్వీడన్‌లోని మాల్మో నగరం అట్టుడికి పోయింది.
ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. మాల్మో నగరంలో కొన్ని గంటలపాటు జరిగిన అల్లర్లలో అనేక కార్లు తగలబడ్డాయి. పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.
దేశ బహిష్కరణకు గురైన అతివాద నాయకుడు రాస్మస్ పలాడన్ ఈ మత గ్రంథాన్ని తగలబెట్టే కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే ఆయన అనుచరులు అనేకమంది మాత్రం మత గ్రంథాన్ని తగలబెట్టే కార్యక్రమం పూర్తి చేశారు.
పోలీసులు రాస్మస్‌ను దేశ సరిహద్దుల అవతల విడిచిపెట్టి వచ్చారు. ఆయనపై రెండు సంవత్సరాల నిషేధం ఉందని వారు తెలిపారు.
జాతివివక్షను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలపై డెన్మార్క్ కు చెందిన అతివాద స్ట్రామ్‌కర్స్ (హార్డ్‌లైన్) పార్టీ అధిపతికి ఈ ఏడాది ఆరంభంలో నెలరోజులపాటు జైలుశిక్ష పడింది.
పార్టీకి చెందిన సోషల్ మీడియా ఛానెళ్లలో ఇస్లాంకు వ్యతిరేకంగా వీడియోలు పోస్టు చేశారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
‘కరోనా ఒక అబద్ధం.. నిబంధనలను తొలగించాలి’ - జర్మనీలో ఆందోళనలు
కరోనా ఒక అబద్ధమని, దాని కోసం ఏర్పాటు చేసిన నిబంధనలను తొలగించాలంటూ యూరప్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. సుమారు 38,000 మంది నిరసనకారులు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో భారీ ఎత్తున ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు 300మందిని అరెస్టు చేశారు. రైట్ వింగ్‌కు చెందిన కొందరు ఆందోళనకారులు రాళ్లు, సీసాలు విసిరారని అధికారులు వెల్లడించారు.
మరోవైపు లండన్ ట్రఫాల్గర్ స్క్వేర్ వద్ద ఆందోళనకారులు గుమిగూడి ప్రభుత్వం నిబంధనలు ఎత్తివేయాలని, కరోనా పేరుతో 5G టెక్నాలజీని కూడా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
వైరస్ అసలు ఒక అబద్ధమని, నిబంధనల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని యూరప్‌లోని ప్రముఖ నగరాలైన పారిస్, జ్యూరిచ్, వియన్నాలలో కూడా నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- టర్కీ: ఇస్లాంను తిరస్కరిస్తున్న యువత
- ‘నేను ఇస్లాం మతాన్ని వదిలేశా.. నా కుటుంబమే నన్ను చంపాలనుకుంటోంది’
- ‘ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే దాడులు చేస్తున్నారు, చంపేస్తామని బెదిరిస్తున్నారు’
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
- ‘వాట్సాప్-బీజేపీ చేతులు కలిపాయి’.. కాంగ్రెస్ పార్టీ ఆరోపణ
- జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం
- 7 నుంచి మెట్రో రైళ్లు నడుస్తాయి.. సినిమా హాళ్లు తెరవడానికి వీల్లేదు
- పంది మెదడులో కంప్యూటర్ చిప్.. ఎలాన్ మస్క్ సంస్థ ప్రయోగం - BBC Newsreel
- భార్యనో, భర్తనో, లవర్‌నో వదిలించుకోవాలనుకుంటే ఈ ఏజెంట్లు రంగంలోకి దిగుతారు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)