పది వేల మందితోనే హజ్ యాత్ర

వీడియో క్యాప్షన్, పది వేల మందితోనే హజ్ యాత్ర

జీవితకాలంలో ఒక్కసారైనా మక్కా మసీదును చూడాలని ముస్లింలు భావిస్తారు.

సౌదీ అరేబియాలోని మక్కా మసీదును దర్శించుకునే పవిత్ర హజ్ యాత్ర ప్రారంభమైంది. ఏటా ఈ యాత్రలో 20 లక్షల మంది పాల్గొంటారు.

కానీ ఐదురోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఈసారి కేవలం పది వేల మంది సౌదీ అరేబియన్లు మాత్రమే పాల్గొనగలుగుతారు.

అలాగే ప్రార్థనా సమయాల్లో సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించాల్సిందే. ఈ యాత్రలో సాతాన్‌ను జయించడానికి చిహ్నంగా ఓ గోడపై రాళ్లతో కొట్టే ప్రధాన ఘట్టంలో కూడా మార్పులు జరగనున్నాయి. ఈ గోడపై విసిరేందుకు డిస్‌ఇన్ఫెక్టెడ్ రాళ్లను ఇవ్వడమే కాకుండా ఒకేసారి యాభై మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. వీటన్నింటితో పాటు ప్రతీ ద్వారం దగ్గర టెంపరేచర్ చెక్ కూడా తప్పనిసరి చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)