టూత్ పేస్ట్ ఎక్కువైతే ఏమవుతుందో తెలుసా?

ఫొటో సోర్స్, OTHERS
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బ్రష్ చేయడానికి ఎంత టూత్ పేస్ట్ వాడాలి? ఎప్పుడైనా ఆలోచించారా?
ఈ విషయం గురించి బహుశా ఎవరూ.. ఎప్పుడూ ఆలోచించి ఉండరు. కానీ, ఆలోచించాలి.
పేస్ట్ మోతాదుకు మించి వాడితే పళ్ల ఆరోగ్యం పాడవుతుంది. ఈ విషయం 'సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ మరియు ప్రివెన్షన్' జరిపిన అధ్యయనంలో తేలింది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ కూడా ఇదే చెబుతోంది.
3 నుంచి 6 ఏళ్ల వయసు పిల్లలు బ్రష్ చేయడానికి బఠాణీ గింజ పరిమాణానికి మించి పేస్ట్ వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల బ్రష్‌లపై ఎక్కువ పేస్ట్ వేస్తుంటారు. కానీ, దానివల్ల చాలా దుష్పరిణామాలుంటాయి.
పిల్లల్లో కొత్తగా పళ్లు వచ్చే సమయంలో అది డెంటల్ ఫ్లోరోసిస్‌కు దారి తీసే ప్రమాదముంది. దీంతో పిల్లల పళ్ల రంగు మారిపోతుంది. దీనికి చికిత్స తీసుకోకపోతే పళ్లు పుచ్చిపోతాయి.
ఎందుకంటే, టూత్ పేస్టుల్లో ఫ్లోరైడ్ ఉంటుంది. దాన్ని తగినంత మోతాదులో తీసుకుంటే పళ్లను కాపాడుతుంది. పరిమితి కంటే ఎక్కువైతే హాని చేస్తుంది.
అందుకే, ఇకనుంచి మీ పిల్లలే కాదు, మీరు కూడా పేస్ట్ ఎంత కావాలో అంతే వేసుకోండి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









