గిరిజన మహిళల ముఖాలపై సంప్రదాయపు గాట్లు

అడెటుటు అలబీ, ఇతరుల ఫోటోలు

ఆఫ్రికాలోని గిరిజన మహిళల ముఖాలపై కొన్ని మచ్చలు కనిపిస్తాయి. అవి పుట్టుకతో వచ్చినవి కావు.. పుట్టాక వేసినవి. రోజుల వయసున్న పసిబిడ్డల ముఖాలపై గాట్లు వేయడం వారి సాంప్రదాయం. ఆ గాట్లు జీవితాంతం వారి ముఖాలకు అంటుకునే ఉంటాయి.

ఈ ఆచారం విషయంలో మార్పు తీసుకురావడానికి మోడల్ ఆడెటుటు అలబీ ప్రయత్నిస్తున్నారు. ఈమెను ఇన్స్టాగ్రామ్‌లో హాలీవుడ్ గాయని రిహానా కూడా ఫాలో అవుతున్నారు.

'ట్రైబల్ మార్క్స్ చాలెంజ్ పేరుతో' సోషల్ మీడియాలో ఉద్యమిస్తున్నారు. తమ అనుమతి లేనిదే ముఖంపై గాట్లు వేయరాదని అలబీ చెబుతున్నారు.

''నేను ఒంటరి మహిళను. ఓ మోడల్‌ను, ఓ బిడ్డకు తల్లిని కూడా. ముఖంపై మచ్చలు కనిపించకుండా ఏం చేయాలంటూ చాలా మంది మాట్లాడుకోవడం నాకు తెలుసు'' అని గిరిజన తెగకు చెందిన మహిళల గురించి ఆమె చెప్పుకొచ్చారు.

ఆడెటుటు అలబీ

''ముఖంపై మచ్చలున్నంత మాత్రాన మీరు కుంగిపోవాల్సిన పని లేదు. నా ముఖంపై కూడా మచ్చలున్నాయి. నేను ఒక ఫోటో షూట్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. విదేశాల నుంచి మంచి స్పందన వచ్చింది'' అన్నారు.

'ట్రైబల్ మార్క్స్ చాలెంజ్' పేరుతో ప్రజల అభిప్రాయాలను మార్చడానికి అలబీ ప్రయత్నిస్తున్నారు. మహిళల అనుమతి లేకుండా వారికి నచ్చని పని చేయకూడదని ఆమె చెబుతున్నారు.

''మహిళల అనుమతితోనే ఈ సాంప్రదాయం పాటించాలితప్ప, వారం రోజుల పసిగుడ్డుగా ఉన్నపుడు గాట్లు వేయడం సరికాదు. నాకు కోట్లు ఇచ్చినా, నా ముఖంపై గాట్లకు ఎలాంటి సర్జరీ చేయించుకోను. నేను ఇలానే ఉంటాను. ఇప్పుడు ఇదే నా ట్రేడ్ మార్క్!''

అడెటుటు అలబీ

హాలీవుడ్ గాయని రిహానాకు అలబీ పెద్ద అభిమాని. అలాంటి రిహానా ఇన్స్టాగ్రామ్‌లో అలబీను ఫాలో అవుతున్నారు

''రిహానా నన్ను ఫాలో అవుతున్నారని చాలామంది చెప్పారు. మొదట నేను నమ్మలేదు. ఏదీ.. నాకు చూపించండి! అని వాళ్లను అడిగాను. రిహానా నన్ను ఫాలో కాకముందే నా ఫోటోలను ఇతర దేశాల్లో చాలామంది ఇష్టపడ్డారు.''

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)