మైండ్ అప్‌లోడింగ్: మరణాన్ని జయించే దిశగా పరిశోధనలు

మరణం లేకుండా మనిషి జీవించడానికి సాంకేతికత ఉపయోగపడగలదా.. ఈ దిశగా చాలా మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
టెక్నాలజీ, కృత్రిమ మేధస్సుతో మానవుల భవిష్యత్ పరిణామాన్ని నియంత్రించే ట్రాన్స్‌హ్యూమనిజం ఉద్యమం ఇందులో భాగమే.
పదేళ్లలో మనం ట్రాన్స్‌హ్యూమనిజం దశలోకి వెళ్తాం అని సాంకేతిక విశ్లేషణ దిగ్గజ సంస్థ గార్టెనర్ చెబుతుండగా.. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కూడా మరణాన్ని మనం మోసం చేయొచ్చని అంటున్నారు.
మనిషి మెదడుతో అనుసంధానం కాగల కంప్యూటర్ టెక్నాలజీపై ఆయన పనిచేస్తున్నారు.
మనిషి మెదడును కాపీ చేయడం సిద్ధాంతపరంగా సాధ్యమేనని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే, మెదడుకు ఉన్న సంక్షిష్టత వల్ల దానిలోని అన్ని రహస్యాలను చేధించడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు.
మనిషి మెదడులో 86 బిలియన్ల న్యూరాన్లు ఉంటాయి. ఇవి విద్యుదావేశాలతో ఒక నెట్‌వర్క్‌ను ఏర్పరుస్తాయి. దీని వల్లే మెదడులో ఆలోచనలు పుడతాయి.
ఈ నెట్‌వర్క్‌ను చేధించాలంటే మైండ్ మ్యాపింగ్ చేయాలి.
కంప్యూటర్ మాదిరిగా మెదడు ఎలా పనిచేస్తుందో శాస్త్రవేత్తలు గమనిస్తూనే ఉన్నారు.
ప్రస్తుతానికైతే, ఎలుక మెదడులోని న్యూరాన్ల యాక్టివిటీ మ్యాప్ చిత్రపటాన్ని తయారు చేయడంలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.
ఇది పూర్తికావడానికి 15 ఏళ్లు పట్టొచ్చని పరిశోధకులు అంటున్నారు.
భవిష్యత్తులో మనిషి మెషిన్‌తో విలీనం కావడం సాధ్యమేనని ట్రాన్స్‌హ్యూమనిస్ట్‌లు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









