వర్ణవివక్షపై విజయం: ఈ 11 ఏళ్ల బాలిక ఒక ఫ్యాషన్ వెబ్‌సైట్ సీఈఓ
శరీరం వర్ణం కారణంగా అవమానాలు ఎదుర్కొన్న ఒక బాలిక, ఆ వెక్కిరింతలను తన విజయానికి సోపానాలుగా మార్చుకుంది. పదకొండేళ్లకే 'ఫ్లెక్సిన్ మై కాంప్లెక్షన్' పేరుతో వెబ్‌సైట్ ప్రారంభించి, దుస్తుల విక్రయం ప్రారంభించింది.
అమెరికాకు చెందిన ఖెరిస్ రోజర్స్ అనే బాలికను స్కూల్లో మిగతా పిల్లలంతా నల్లగా ఉందంటూ ఎగతాళి చేసేవారు. మొదట్లో ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు పెట్టిన ఆమె స్కూలే మారాల్సివచ్చింది.
తాను కూడా నీలాగే ఎన్నో బాధలు పడ్డానంటూ ఆమె బామ్మ ఖెరిస్‌తో చెప్పింది. చివరకు ఆ రంగు పేరుతోనే సొంత వెబ్ సైట్ ప్రారంభించేలా స్ఫూర్తి నింపింది.
ఆ వెబ్‌సైట్ ద్వారా ఖెరిస్ ఇప్పటివరకూ 10 వేలకు పైగా టీ-షర్ట్స్ విక్రయించింది. చిన్న వయసులోనే న్యూయార్క్ ఫ్యాషన్ వీక్‌లో అడుగుపెట్టిన ఫ్యాషన్ డిజైనర్‌గా ప్రశంసలు అందుకుంది.
ఏదో ఒకరోజు సొంతంగా స్టోర్ ప్రారంభిస్తానని చెబుతున్న ఖెరిస్, సూపర్ మోడల్ అవుతాననీ చెప్తోంది.
తన పాటలు, డ్యాన్సులు, నటనతో అందరినీ అలరిస్తానని అంటోంది.
వర్ణ వివక్షను ఎదుర్కొంటున్నవారు ఆ అవమానాలను అస్సలు పట్టించుకోవద్దని, అద్దం ముందు నిల్చుని ఆత్మవిశ్వాసం పెంపొందించుకోండంటూ తనలాంటి బాధితులకు ధైర్యం చెప్తోంది.
ఇవికూడా చదవండి:
- డేరాబాబా: ఏడాది జైలు శిక్షా కాలంలో సంపాదన రూ.6వేలు
- హైదరాబాద్ జంటపేలుళ్లు: నెత్తుటి గాయానికి నేటితో 11 ఏళ్లు
- ''మమ్మల్ని సెక్స్ బానిసలుగా అమ్మేశారు, అత్యాచారం చేశారు''
- మైక్రోసాఫ్ట్: ‘రష్యా పొలిటికల్ హ్యాక్’ను విజయవంతంగా అడ్డుకున్నాం
- వెనెజ్వేలా : కేజీ బియ్యం కొనాలంటే ఎన్ని కట్టల డబ్బు కావాలో తెలుసా?
- మమ్మీ మిస్టరీ వీడింది: తయారీలో తుమ్మ జిగురు పాత్ర
- డైమండ్ నగరంలో 'గోల్డెన్ స్వీట్' - మరి రుచి చూస్తారా?
- మీ గర్ల్ ఫ్రెండ్‌కు సారీ ఎలా చెబుతారు?
- అనధికారిక ఖాతాల ఏరివేతలో ఫేస్‌బుక్, ట్విటర్
- డిజైనర్ మీసాలు... వెరైటీ గడ్డాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)