భయానక దృశ్యాల వెనుక కథ ఏమిటి?

ఫొటో సోర్స్, Getty Images
పల్ప్ ఫిక్షన్, హాస్టల్, కిల్ బిల్, సిన్ సిటీ, ఫైనల్ డెస్టినేషన్.. వంటి సినిమాల్లో నిలువెల్లా నెత్తురోడే మనుషులు, కత్తులతో కుత్తుకలు నరుక్కునే దృశ్యాలు, విచ్ఛిన్నమైన శరీర అవయవాలు వంటి ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు చూసే ఉంటారు.
మనుషులు చనిపోయి సగం కుళ్లిపోయిన శరీరాలతో మళ్లీ బతికే ‘జోంబీ’ల దృశ్యాలు అనేకం చూసుంటారు. మీరు గత 30 సంవత్సరాల్లో ఏదైనా హారర్ సినిమా చూసి ఉంటే ఇలాంటి ఒళ్లు గగుర్పొడిచే సీన్లు చూసి భయపడే ఉంటారు.
ఈ సీన్ల వెనుక ఉన్న మేకప్ మాంత్రికుడు గ్రెగ్ నికోటిరో. ఆయన వందలాది సినిమాల్లో.. నిజమైన వాటిలా భ్రమింపజేసే కృత్రిమ అవయవాల ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. అమెరికా టెలివిజన్ షో ‘ద వాకింగ్ డెడ్’ నిర్మాత, దర్శకుడు, మేకప్ ఆర్టిస్ట్ ఆయనే.
నిజమైనవిగా కనిపించేలా కృత్రిమ అవయవాలను చూపటాన్ని సినీ పరిభాషలో ప్రోస్తటిక్ ఎఫెక్ట్స్ అని వ్యవహరిస్తారు. వెండి తెరమీద భయంకరమైన నెత్తురు పారించి మనలను భీతావహులను చేసే ఈ కళ గురించి ‘బీబీసీ న్యూస్‌బీట్’తో ఆయన పంచుకున్న విశేషాలివీ...
హెచ్చరిక: ఈ కథనంలో జలదరింపజేసే జోంబీ మేకప్ ఫొటోలు ఉన్నాయి.

‘‘ఇది ఒక మ్యాజిక్ ట్రిక్ లాంటిది. ప్రేక్షకుల దృష్టి మరలుస్తాం.. చేతివాటం ప్రదర్శిస్తాం...’’ అని గ్రెగ్ వివరించారు.
హారర్ సినిమాలో లేదా వాకింగ్ డెడ్ షోలో భీతావహ దృశ్యాన్ని మీరు చూసినపుడు.. మేం కట్‌ను ఆ సీన్‌లో ఉన్న పాత్ర మీదకు తీసుకెళతాం. జనం ఎక్కువగా తాము చూసిన దృశ్యం మీదకన్నా.. ఆ సీన్‌లో ఉన్న పాత్ర ఎలా స్పందిస్తుంది అనే దానిని బట్టి ప్రతిస్పందిస్తుంటారు’’ అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
సినిమాల్లో ఇటువంటి దృశ్యాలను షూటింగ్ పూర్తయిన తర్వాత డిజిటల్ ఎఫెక్ట్స్‌తో కాకుండా.. ఆయా దృశ్యాలను నిజమైనవిగా కనిపించేలా మేకప్ ద్వారా (ప్రాప్రిక్టల్ ఎఫెక్ట్స్) కృత్రిమంగా రూపొందిస్తుంది గ్రెగ్ బృందం.
సినిమాల్లో భీతావహంగా కనిపించే ఈ ఎక్స్‌ట్రా నటులను తెర వెనుక ఈ మేకప్‌లతో చూసినపుడూ అంతే భయంకరంగా కనిపిస్తారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 1
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 2
గ్రెగ్ 1980ల్లో కెరీర్ ప్రారంభించినపుడు.. నైట్ ఆఫ్ ద లివింగ్ డెడ్ (1968), డాన్ ఆఫ్ ద డెడ్ (1978) వంటి క్లాసిక్ జోంబీ సినిమాల రూపకర్త జార్జ్ ఎ. రోమెరో దగ్గర పనిచేశారు.
ఆ సినిమాలే.. షాన్ ఆఫ్ ద డెడ్, ద వాకింగ్ డెడ్ వంటి ఆధునిక జోంబీ మూవీలు, టీవీ షోలకు ప్రేరణనిచ్చాయి.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 3
ఎన్నో ఏళ్లుగా డిజిటల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ జెనరేటెడ్ ఇమేజరీ (సీజీఐ) లలో భారీ పురోగతి ఉన్నప్పటికీ.. గ్రెగ్ తన స్పెషాలిటీ అయిన ప్రాక్టికల్ ప్రోస్తటిక్ మేకప్ టెక్నిక్‌నే కొనసాగిస్తున్నారు.
అయితే.. దర్శకులు కోరకుంటున్న దృశ్యాలు దేని ద్వారా బాగా వస్తాయనేది తాము వారికి వివరిస్తామని.. ఈ దృశ్యాలను ఎలా రాబట్టాలనే దాని మీద 15 ఏళ్లలో తన దృక్కోణం చాలా మారిందని గ్రెగ్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘ఉదాహరణకు.. ఈ గదిలో నుంచి ఒక డైనోసార్ నడుస్తున్న దృశ్యం కావాలంటే.. దానిని డిజిటల్ ఎఫెక్ట్ ద్వారా రూపొందించటమే బాగుంటుందేమో’’ అని ఆయన అంటారు.
‘‘నేను నా ప్రాణమున్నంత వరకూ ప్రాక్టికల్ మేకప్ ఎఫెక్ట్‌లనే ఇష్టపడతాను. అయినా.. ఒక నిర్దిష్ట దృశ్యానికి ఇది సరిపోదని నేను భావించిన ఉదంతాలు ఉన్నాయి’’ అని గ్రెగ్ వివరించారు.
ఈ కథనంలో Instagram అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Instagram కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of Instagram ముగిసింది, 4
మరైతే ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ పరిశ్రమలోకి రావటం కష్టమా? అంటే.. అలాంటిదేమీ లేదంటారు గ్రెగ్.
‘‘పదేళ్ల కిందటైతే ఇది కష్టమైన పనని చెప్పేవాడినేమో. కానీ ఇప్పుడలా అనుకోను’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘మా జోంబీలను ఎలా రూపొందించాలనే కిటుకులను ఏదైనా యూట్యూబ్ వీడియోను చూడటం ద్వారా కానీ ద వాకింగ్ డెడ్ (బిహైండ్ ద సీన్స్) తెర వెనుక దృశ్యాలను చూడటం ద్వారా కానీ తెలుసుకోవచ్చు. నిజానికి ఇది చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది’’ అని చెప్పారు.
‘‘గేమ్ ఆఫ్ థ్రోన్స్, అమెరికన్ హారర్ స్టోరీ, ద వాకింగ్ డెడ్, బ్లాక్ మిర్రర్ వంటి అద్భుతమైన షోలతో ఈ జానర్ టీవీ షోల పునరాగమనంతో మేం చేస్తున్న పనికి ఇంతకుముందు కంటే ఇప్పుడు మంచి ఆదరణ ఉందని నేను భావిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)