You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ట్రంప్-కిమ్ తిట్ల దండకం
ఆసియాలో వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. 'నేను చాలా మంచి మధ్యవర్తిని, సంధానకర్తను' అని తెలిపారు.
వియత్నాం అధ్యక్షుడితో సమావేశమయ్యేందుకు హనోయి వెళ్లిన ట్రంప్, దక్షిణ చైనా సముద్రంపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో సాయపడతానన్నారు.
అంతకుముందు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై ట్విటర్‌లో స్పందించారు.
"కిమ్ జోంగ్ -ఉన్ ఎందుకు నన్ను 'ముసలి' అంటూ అవమానకరంగా పిలుస్తున్నారు? అతన్ని నేను అతన్ని "షార్ట్ అండ్ ఫ్యాట్" అని పిలిచానా?. సరే, అతనితో స్నేహితుడిగా మెలిగేందుకు ఎంతో ప్రయత్నించాను. ఏదో ఒకరోజు అది నిజమవుతుందేమో" అని ట్వీట్ చేశారు ట్రంప్.
ఆసియాలో ట్రంప్ పర్యటనపై కిమ్ జోంగ్- ఉన్ శనివారం విమర్శలు గుప్పించారు. "అది ఓ యుద్ధోన్మాది పర్యటన" అని అభివర్ణించారు. దాంతో పాటు, ట్రంప్ "మతి స్థిమితం లేని వృద్ధుడు" అని కిమ్ వ్యాఖ్యానించారు.
కిమ్ తిట్లకు స్పందించిన ట్రంప్ పై ట్వీట్ చేశారు.
అలాగే గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ వస్తున్న ఆరోపణలపై ట్రంప్ తీవ్ర పదజాలంతో స్పందించారు.
"రష్యాతో సంబంధాలు మెరుగుపడటం మంచి విషయమన్న నిజాన్ని మా దేశంలోని విమర్శకులు, ఫూల్స్ అందరూ ఎప్పుడు గ్రహిస్తారో’’ అని అన్నారు.
"ఉత్తర కొరియా, సిరియా, ఉక్రెయిన్, ఉగ్రవాద సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నా. అందుకు రష్యా సహకారం బాగా ఉపయోగపడుతుంది" అని ట్రంప్ పేర్కొన్నారు.
మా ఇతర కథనాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)