నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ

వీడియో క్యాప్షన్, విద్యార్థుల పేర్లతో లాగిన్ అయ్యి, ఆ తర్వాత నేరుగా జూమ్ మీటింగ్‌లోకి వచ్చేశారు

పదో తరగతి విద్యార్థులు, తల్లిదండ్రులతో నారా లోకేష్ జూమ్‌ మీటింగ్ ఏర్పాటు చేశారు. విద్యార్థులతో నారా లోకేష్ మాట్లాడుతుండగా వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హఠాత్తుగా జూమ్ మీటింగ్‌లో కనిపించారు.

తొలుత వారిద్దరూ విద్యార్థుల పేరుతో లాగిన్ అయి, ఆ తర్వాత నేరుగా జూమ్ మీటింగ్‌లో కనిపించారు.

వీరితో పాటు వైసీపీకి చెందిన పలువురు నాయకులు కూడా జూమ్ మీటింగ్‌లో కనిపించారు. నారా లోకేష్ మీద వైసీసీ నాయకులు విమర్శలు చేశారు.

జూమ్ చాట్‌లో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీని, లోకేష్‌ని విమర్శిస్తూ కామెంట్లు చేశారు.

వైసీపీ తీరుని టీడీపీ తీవ్రంగా తప్పుబట్టింది. విద్యార్థులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని, తన తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవానికి అడ్డగోలుగా వ్యవహరిస్తోందని నారా లోకేష్ విమర్శించారు.

ఇలాంటి పనులతో ఏం సాధించాలనుకుంటున్నారో అర్థంకావడం లేదన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)