నేపాల్ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు
నేపాల్ తమ దేశ సరిహద్దులను చైనా ఆక్రమిస్తోందని ఆరోపిస్తూ రూపొందించిన నివేదిక ఒకటి బీబీసీకి లభించింది.
తమ భూభాగంలో చైనా జోక్యం చేసుకుంటోందని నేపాల్ అధికారికంగా వాదించటం ఇదే తొలిసారి.
నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని హమ్లా జిల్లాలోకి చైనా చొరబడుతోందన్న ఆరోపణలు రావటంతో గత సెప్టెంబర్‌లో నేపాల్ దర్యాప్తు నిర్వహించి ఈ నివేదికను రూపొందించింది.
అయితే తమ దేశం నుంచి ఎలాంటి ఆక్రమణలూ లేవని కఠ్మాండూలోని చైనా రాయబార కార్యాలయం తిరస్కరించింది.
బీబీసీ అడిగిన ప్రశ్నలకు నేపాల్ ప్రభుత్వం నుంచి ఇంకా ప్రతిస్పందన రాలేదు.

ఇవి కూడా చదవండి:
- ‘పోర్న్ సైట్లలోని నా ఫొటోలను తెలిసినవారు ఎవరైనా చూస్తారేమో అని భయంగా ఉంది’
- 'హిజాబ్‌కు రియాక్షనే కాషాయ కండువా'-ఉడుపి నుంచి గ్రౌండ్ రిపోర్ట్
- ‘యుక్రెయిన్‌లో ఉండొద్దు, ఇండియా వెళ్లిపోండి’ - భారత పౌరులకు రాయబార కార్యాలయం సూచన
- ‘పరిహారం ఇవ్వలేదు, పునరావాస కాలనీలు కట్టలేదు. కానీ ఊళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారు’
- యుక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం తప్పించడానికి 5 మార్గాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



