ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుడిగా ఎదిగిన అదానీ
సుమారు 24 వేల కోట్ల రూపాయలు... ఇది 2016లో గౌతమ్ అదానీ సంపద.
మరి ఈరోజు ఆయన సంపద ఎంతో తెలుసా? దాదాపు 6 లక్షల 67 కోట్ల రూపాయలు.
కేవలం ఆరేళ్లలో ప్రపంచ సంపన్నుల్లో ఒకరిగా మారారు గౌతమ్ అదానీ. ఆసియాలోనే అత్యంత సంపన్నుడి స్థానం నేడు ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య తిరుగుతోంది.
ఇప్పుడు అదానీ అంటే ఒక బ్రాండ్. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టులను సొంతం చేసుకుంది అదానీ గ్రూపే.
తెలంగాణలోనూ అదానీ గ్రూప్ అనేక సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ నడుపుతోంది. వంట నూనెల నుంచి ఎయిర్‌పోర్టుల వరకు అనేక వ్యాపారాలు ఈ గ్రూప్ సొంతం.
మరి కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన గౌతమ్ అదానీ భారత్‌లో సుమారు 10 లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించారు?
తండ్రికి భిన్నంగా గౌతమ్ అదానీ
గుజరాత్‌కు చెందిన కుటుంబంలో 1962లో జన్మించారు గౌతమ్ అదానీ. ఆయన తండ్రి క్లాత్స్‌పైన చుట్టే ప్లాస్టిక్ కవర్లను తయారు చేసేవారు. నాడు ధీరూభాయి అంబానీకి కూడా వీరు సప్లై చేసే వాళ్లు.
కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన అదానీ, తన కలలను సాకారం చేసుకునేందుకు ముంబయి చేరుకున్నారు.
రంగు, ఆకారం, సైజు వంటి అంశాల ఆధారంగా వజ్రాలను గుర్తించే డైమండ్ సార్టర్‌గా కొన్నాళ్లు పని చేశారు.
ఆ తరువాత ఆయనే సొంతంగా వజ్రాల వ్యాపారం మొదలుపెట్టారు. అయితే గౌతమ్ అదానీ కలలు ఆయన తండ్రి కన్నా పెద్దవి. అందుకే ఆయన తండ్రికి భిన్నంగా కమోడిటీస్ వ్యాపారంలో అడుగు పెట్టారు.
అలా 1988లో అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ను స్థాపించారు గౌతమ్ అదానీ. ఆ తరువాత ఒక్కో రంగానికి విస్తరిస్తూ నేడు అది అదానీ గ్రూప్‌గా ఎదిగింది.

ఇవి కూడా చదవండి:
- ‘నేను భారతీయురాలినని నిరూపించుకోవడానికి ఐదేళ్లు కష్టపడ్డాను’
- ‘నాకు చాలా భయమేసింది.. నేను భయపడినప్పుడల్లా అల్లా పేరు తలుచుకుంటాను’
- ‘పొరుగు దేశాన్ని ఆక్రమించినందుకు రూ. 24 వేల కోట్లు పరిహారం చెల్లించండి’
- ఎవరికీ తెలియని రహస్య ప్రాంతాల్లో దాక్కున్నా వెంటాడి చంపేసే ఆయుధాలు
- ముస్లింలు, మహిళలు లక్ష్యంగా సోషల్ మీడియాలో విద్వేషం ఎలా వ్యాపిస్తోంది?- బీబీసీ పరిశోధన
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




