‘లతా మంగేష్కర్ ఫొటో చూడకుండా మా నాన్న రికార్డింగ్‌కు వెళ్లేవారు కాదు’
గాయని లతా మంగేష్కర్ మృతి తీరని లోటని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అన్నారు.
తన తండ్రి లతా మంగేష్కర్ నుంచి స్ఫూర్తి పొందారని చెప్పిన ఆయన తాను కూడా లతా నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు.
ఎంతో గొప్ప గాయని అయినప్పటికీ ఆమె ప్రతి పాట పాడే ముందు సాధన చేసేవారని, తాను స్టేజిపై ప్రదర్శనలు ఇవ్వడంలో లతాజీ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని రెహమాన్ అన్నారు.
మరోవైపు లతా మృతి పట్ల విదేశాల నుంచి కూడా సంతాప సందేశాలు వస్తున్నాయి.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆ దేశ మంత్రులు... బంగ్లాదేశ్, నేపాల్ నేతలు కూడా లతా మంగేష్కర్ మృతికి సంతాపం తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
