తెలంగాణ శాస్త్రీయ నృత్యరీతిని అభివృద్ధి చేసిన పద్మజా రెడ్డికి పద్మశ్రీ

వీడియో క్యాప్షన్, తెలంగాణ శాస్త్రీయ నృత్యరీతిని అభివృద్ధి చేసిన పద్మజా రెడ్డికి పద్మశ్రీ

కాకతీయ ప్రముఖుడు జాయపసేనాని రాసిన నృత్య రత్నావళి అనే గ్రంథాన్ని అధ్యయనం చేసి, కాకతీయం అనే పేరుతో తెలంగాణకు ప్రత్యేకమైన సరికొత్త శాస్త్రీయ నృత్యరీతిని అభివృద్ధి చేసిన డా.జి.పద్మజా రెడ్డికి కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది.తెలంగాణకంటూ ప్రత్యేకమైన సరికొత్త శాస్త్రీయ నృత్యరీతిని అభివృద్ధి చేశారు డా. జి పద్మజా రెడ్డి. దానికి కాకతీయం అని పేరు పెట్టి అనేక వేదికలపై ప్రదర్శించారు.

కాకతీయ ప్రముఖుడు జాయప సేనాని నృత్య రత్నావళి గ్రంథాన్ని అధ్యయనం చేసి, అందులో వర్ణనలను, కాకతీయుల కాలం నాటి గుడులైన రామప్ప వంటి దేవాలయాలపై శిల్పాలతో అన్వయం చేసి ఈ కాకతీయంను అభివృద్ధి చేశారు.

గతంలో నటరాజ రామకృష్ణ ఈ తరహా ప్రయోగం చేసి పేరిణి శివతాండవాన్ని అభివృద్ధి చేశారు. దాదాపు ఐదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్య రంగంలో ఉన్న పద్మజ, ఈ రంగంలో అరుదైన ప్రయోగాలు చేశారు. 3 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి, 700 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. పద్మజా రెడ్డికి పద్మశ్రీ ప్రకటించింది కేంద్రం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)