వికారాబాద్ రిసార్ట్‌లో స్వలింగ సంపర్కుల పెళ్లి

వీడియో క్యాప్షన్, వికారాబాద్ రిసార్ట్‌లో స్వలింగ సంపర్కుల పెళ్లి

గే పెండ్లికి వికారాబాద్‌లోని గ్రీన్‌ఫీల్డ్‌ రిసార్ట్‌ వేదికైంది.

ఎనిమిది ఏండ్ల క్రితం ఓ డేటింగ్‌ యాప్‌లో సుప్రియో చక్రవర్తి, అభయ్‌ డాంగ్‌ ఒకరికొకరు పరిచయం అయ్యారు.

సుప్రియో హైదరాబాద్‌లోని హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్కూల్‌లో లెక్చరర్‌గా, అభయ్‌ ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.

ఒకరి భావాలు ఒకరు తెలుసుకొని ప్రేమికులుగా మారారు. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకొని తల్లిదండ్రులకు చెప్పారు.

వారి అంగీకారంతో, రెండు కుటుంబాల సమక్షంలో ట్రాన్స్‌జెండర్‌ సోఫియా డేవిడ్‌ వీరి వివాహాన్ని జరిపించారు.

స్వలింగ సంపర్కుల వివాహ వేడుకలో మంగళ స్నానాలు, సంగీత్‌ కార్యక్రమాలు కూడా జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)