గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్: 26 మంది మావోయిస్టులు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ధనోరా తాలూకాలోని అటవీ ప్రాంతంలో పోలీసులు - మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. గ్యారపట్టి అటవీ ప్రాంతంలో మహారాష్ట్ర సీ-60 యూనిట్‌ పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

ఇందులో 26 మంది మావోయిస్టులు చనిపోయినట్లు గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్ గోయల్ చెప్పారు. వారి మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు పోలీసులు కూడా గాయపడినట్లు ఆయన వెల్లడించారు.

గాయపడిన పోలీసులను హెలికాప్టర్ ద్వారా నాగ్‌పుర్‌లోని ఆరెంజ్ సిటీ ఆస్పత్రికి తరలించారు.

వారికి ఐసీయూలో చికిత్స జరుగుతోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

మావోయిస్టు టాప్ కమాండర్‌తో పాటు మరో 25 మంది నక్సలైట్లు చనిపోయినట్లు తనకు సమాచారం ఉందని మహారాష్ట్ర హోంమంత్రి దిలీప్ వాల్సే పాటిల్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది.

చనిపోయిన మావోయిస్టులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు పేర్లు బయటపెట్టలేమని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)