ఆస్ట్రోనాట్‌కు అనారోగ్యం, అత్యవసరంగా ISS నుంచి భూమ్మీదకు..

ఆస్ట్రోనాట్‌కు అనారోగ్యం, అత్యవసరంగా ISS నుంచి భూమ్మీదకు..

ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో ఉన్న ఒక ఆస్ట్రోనాట్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో స్పేస్‌ఎక్స్ క్యాప్సూల్ అత్యవసరంగా భూమి మీదికి తిరిగి వచ్చింది. జనవరి 15 తెల్లవారుజామున అమెరికాలో కాలిఫోర్నియా సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఇది సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని నాసా తెలిపింది.

నాసా-స్పేస్‌ఎక్స్ సంయుక్తంగా అందించిన లైవ్ టెలికాస్ట్ ప్రకారం.. క్రూ డ్రాగన్ క్యాప్సూల్ పది గంటల పాటు అంతరిక్షం నుంచి భూమి వైపు ప్రయాణించి శాన్ డియాగో తీరంలో పారాచూట్ల సహాయంతో దిగింది.

బీబీసీ సైన్స్ కరస్పాండెంట్ జార్జినా రాన్నార్డ్ తెలిపిన వివరాల ప్రకారం...... క్రూ 11 (ఎలెవెన్) టీమ్‌లోని నలుగురు ఆస్ట్రోనాట్స్ ఆరున్నర నెలల పాటు ఉండటం కోసం గత ఆగస్టు 1న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ లెక్క ప్రకారం దాదాపు ఇంకో నెల రోజుల పాటు అక్కడే ఉండాల్సి ఉంది. కానీ, గతవారం... ప్లాన్ ప్రకారం చేపట్టాల్సిన స్పేస్‌వాక్‌ను నాసా సడెన్‌గా ఆపేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)