కోకా కోలా: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ కాలుష్యాన్ని సృష్టిస్తోన్న కంపెనీ

వీడియో క్యాప్షన్, కోకా కోలా: ప్రపంచంలోనే అత్యధిక ప్లాస్టిక్ కాలుష్యాన్ని సృష్టిస్తోన్న కంపెనీ

ప్రపంచంలోని సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు ఏడాదికి 4 లక్షల 70 వేల కోట్ల ప్లాస్టిక్ బాటిళ్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

అవన్నీ ఒకసారి వాడి పారేసేవే. వాటిలో నాలుగో వంతు బాటిళ్లను కోకాకోలా కంపెనీ ఒక్కటే తయారు చేస్తోంది.

విమర్శలు పెరిగిపోవటంతో తమ ప్లాస్టిక్ కాలుష్య సమస్యను పరిష్కరించటానికి దాదాపు నాలుగేళ్ల క్రితం ఒక ప్రణాళికను ప్రకటించింది కోకాకోలా.

అయితే ఈ హామీలను అందుకోవడంలో కోకాకోలా విఫలమవుతున్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది. కొన్ని ప్రాంతాల్లోనైతే – ముఖ్యంగా పేద దేశాల్లో పరిస్థితి దారుణంగా మారుతోంది.

బీబీసీ పనోరమా ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)