కేవలం 15 నెలల్లో 46 సింహం పిల్లలు పుట్టాయోచ్!

వీడియో క్యాప్షన్, కేవలం 15 నెలల్లో 46 సింహం పిల్లలు పుట్టాయోచ్!

జునాగఢ్‌ జూలో కేవలం 15 నెలల్లో 46 సింహం పిల్లలు పుట్టాయి.

ఆసియా సింహాల సంతానోత్పత్తికి భారతదేశంలో ఒకే ఒక కేంద్రం ఉంది. అది సక్కర్‌బాగ్‌లోనే ఉంది. 2020, 2021లో సింహాల సంఖ్యను పెంచడంలో ఈ కేంద్రం అపూర్వ విజయం సాధించింది.

ప్రతి రోజూ బోనును శుభ్రం చేస్తుంటాం. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తాం. తల్లులు, పిల్లలకు సమతులాహారం అందిస్తాం. మా పశు వైద్యులు వాటి ఆరోగ్యాన్ని ఓ కంట కనిపెడుతూ ఉంటారు. తల్లి, పిల్లలకు ఆరోగ్య సమస్యలు వస్తే వెంటనే వాటికి చికిత్స అందిస్తాం అని సక్కర్‌బాగ్ జూ రేంజ్ ఆఫీసర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)