‘‘నీరజ్ చోప్రా, మీరో బాహుబలి, మేమంతా మీ సైన్యం!’’

వీడియో క్యాప్షన్, ‘‘నీరజ్ చోప్రా.. మీరో బాహుబలి, మేము అంతా మీ సైన్యం!’’

టోక్యో ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రోలో భారత్‌కు స్వర్ణ పతకం సాధించి పెట్టిన నీరజ్‌ చోప్రాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు పతకాలు సాధిస్తారని మొదట్నుంచీ ఆశించిన అతి కొద్దిమంది యువ క్రీడాకారుల్లో నీరజ్ చోప్రా ఒకరు.

గత కొన్నేళ్లుగా జావెలిన్ త్రోలో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ నీరజ్ చోప్రా అందరికీ ఆకట్టుకుంటూ వచ్చారు.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీ-3లో 88.07 మీటర్లకు జావెలిన్ త్రో విసిరి నీరజ్ తన సొంత జాతీయ రికార్డును తానే అధిగమించారు.

అంజూ బాబీ జార్జ్ తరువాత ప్రపంచ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ అథ్లెట్ నీరజ్ ఒక్కరే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)