సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ హస్త కళలతో ఓ గ్రామాన్ని సృష్టించిన యువతి

వీడియో క్యాప్షన్, సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ హస్త కళలతో ఓ గ్రామాన్ని సృష్టించిన యువతి

ఒకవైపు చరఖా, మగ్గాల సవ్వడీ, మరోవైపు చెక్కబొమ్మల తయారీ, ఇటు వ్యవసాయం చేసే రైతులు, వారికి సాయం చేస్తూ కూలీలు ఇలా ఒకటా రెండా.. కుటీర పరిశ్రమల నుంచి పాడిపంటల వరకూ అన్నీ ఉన్న అందమైన గ్రామీణ వాతావరణం అక్కడ కనిపిస్తుంది.

ఇన్ని ప్రత్యేకతలున్న ఆ గ్రామం ఎక్కడో మారుమూల పల్లె కాదు. విశాఖ మహానగరంలో ఉంది. దీని పేరు సంకల్ప్‌ ఆర్ట్‌ విలేజ్‌. దీన్ని తీర్చిదిద్దింది ఓ అమ్మ, నాన్న, వాళ్ల అమ్మాయి.

పల్లెల వాతావరణం ఇప్పుడు కనుమరుగవుతోంది. పల్లెలున్నా అవి పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉంది. ఈ పరిస్థితుల్లో అసలైన గ్రామీణ వాతావరణాన్ని పునర్నిర్మించేందుకు ఓ కుటుంబం ప్రయత్నించింది.

విశాఖపట్టణానికి చెందిన చలపతిరావు, పార్వతి దంపతులు ఔషధ మొక్కలతో పాటు అందమైన పూల మొక్కలు, కూరగాయలు, ఆకు కూరలను సేంద్రీయ పద్ధతిలో పండిస్తూ నర్సరీలు నిర్వహిస్తుంటారు.

వీరి కుమార్తె జమీల్యా నర్సరీలకు డిజైనింగ్‌ హెడ్‌గా పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి సంకల్ప్‌ ఆర్ట్‌ విలేజ్‌ను నిర్మించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)