ద్యుతీ చంద్: బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌ వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ 2020 నామినీ

వీడియో క్యాప్షన్, ద్యుతీ చంద్: భారత్‌లో అత్యంత వేగంగా పరిగెత్తే మహిళ

హార్మోన్ టెస్టులో విఫలమైన ద్యుతీ చంద్‌పై అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 2014లో నిషేధం విధించింది. ఆమె శరీరంలో టెస్టోస్టిరాన్ అసాధారణ స్థాయిలో ఉన్నట్లు తేలింది. దీన్ని 'హైపర్‌ఆండ్రోజెనిజమ్' అంటారు.

అయితే, ఆమె ఈ నిషేధంపై పోరాడారు. ఇలా నిషేధం విధించడం వివక్షతో కూడిన నిర్ణయమని, తప్పుడు నిర్ణయమని తర్వాత తేలింది. ఆ మరుసటి ఏడాదే ఆమె 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. 2018 ఆసియా క్రీడల్లో రెండు రజత పతకాలు సాధించారు.

ప్రస్తుతం భారత్‌లో అత్యంత వేగంగా పరిగెత్తే మహిళ ద్యుతీ చంద్... రెండోసారి కూడా బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్‌ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినీల జాబితాలో చోటు సంపాదించారు.

షూట్, ఎడిట్: శుభమ్ కౌల్, కెంజ్ ఉల్ మునీర్

రిపోర్టర్: రాఖీ శర్మ, భువనేశ్వర్

ప్రొడ్యూసర్: వందన

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)