Rajinikanth: హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజినీకాంత్

వీడియో క్యాప్షన్, Rajinikanth: హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజినీకాంత్

సినిమా షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన నటుడు రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు.

సినిమా షూటింగ్ బృందంలోని పలువురికి కోవిడ్-19 సోకిందని, దీంతో రజినీకాంత్‌కు కూడా ఈనెల 22వ తేదీన పరీక్షలు జరిపామని, అయితే ఆయనకు నెగెటివ్ వచ్చిందని అపోలో ఆస్పత్రి ప్రకటించింది.

రక్తపోటు స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయని, దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది.

రక్తపోటు అదుపులోకి రాగానే ఆయన్ను డిశ్చార్జి చేస్తామని తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)