గుజరాత్: ఈ రిటైర్డ్ టీచర్ ఇల్లు వేలాది పక్షులకు నిలయం

వీడియో క్యాప్షన్, గుజరాత్: ఈ రిటైర్డ్ టీచర్ ఇల్లు వేలాది పక్షులకు ఆవాసం

పక్షులకు ఆహారం అందించాలని మనకు పెద్దలు చెబుతుంటారు.

మనలో చాలా మంది చెట్లకు ట్రేలు వేలాడదీసి అందులో ఆహారం, నీళ్లు పెడుతూ ఉంటారు.

అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాన్యులు వేలాది సంఖ్యలో పక్షులను పోషించగలరా? కష్టమే.

కానీ ఆ కష్టాన్ని చాలా ఇష్టంగా చేస్తున్నారు గుజరాత్‌కు చెందిన ఓ 84 ఏళ్ల పెద్ద మనిషి.

ఈయన పేరు రామ్‌జీ భాయ్. ఓ రిటైర్డ్ టీచర్.

గుజరాత్‌లోని భావ్‌ నగర్ సమీపంలోని సిహోర్‌లో నివసిస్తున్నారు.

రామ్‌జీ నిస్వార్థంగా పక్షులకు ఆహారం ఇవ్వడం ప్రారంభించారు.

క్రమంగా రామ్‌టెక్రీలో ఇప్పుడొక బర్డ్స్ సాంక్చురీనే తయారైంది. రామ్‌జీ భాయ్ రోజూ 15 వందల పక్షులకు ఆహారం పెడతారు.

బీబీసీ ప్రతినిధులు నితిన్ గోహిల్, సదఫ్ ఖాన్ అందిస్తున్న ఆసక్తికరమైన కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)