ఏనుగుపై యోగా చేస్తూ కిందపడ్డ బాబా రామ్‌దేవ్

వీడియో క్యాప్షన్, ఏనుగుపై యోగా చేస్తూ కిందపడ్డ బాబా రామ్‌దేవ్

బాబా రామ్ దేవ్ ఉత్తరప్రదేశ్‌లోని మథురలోని ఒక ఆశ్రమంలో నిర్వహించిన యోగా క్యాంప్‌లో కొత్తగా యోగా నేర్పించే ప్రయత్నం చేశారు.

అలంకరించి ఉన్న ఏనుగుపై పట్టా లేకుండా ఆసనాలు వేద్దామని ఆయన పైకి ఎక్కారు. పద్మాసనంలో కూర్చుని ప్రాణాయామం సాధన ఎలా చేయాలో ఆయన వివరిస్తున్నారు.

ఇంతలో ఏమైందో ఏమో తెలియదు గానీ ఆ ఏనుగు కుదురుగా ఉండకుండా అటూ ఇటూ కదిలింది. అయినా బాబా యోగా భంగిమను కొనసాగించారు.

మరోసారి ఏనుగు కదలడంతో అదుపు తప్పి రాందేవ్ ఒక్కసారిగా కిందపడిపోయారు. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)