You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
డోనల్డ్ ట్రంప్: 'ఇప్పుడు బాగానే ఉన్నాను. రాబోయే రెండు మూడు రోజులే చాలా కీలకం'
'నా ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే, కానీ, రాబోయే రెండు మూడు రోజులే 'అసలు పరీక్ష' అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
కోవిడ్ 19 నిర్థరణ అయిన 24 గంటలు లోపే ట్రంప్ వాల్టర్ రీడ్ ఆస్పత్రిలో చేరారు.
అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితులపై పలు రకాల వార్తలు రావడంతో, తన క్షేమ సమాచారాలు తెలుపుతూ ట్రంప్ శనివారం సాయంత్రం ట్విటర్‌లో ఒక వీడియో పోస్ట్ చేసారు.
అమెరికా అధ్యక్షుడు బాగానే ఉన్నారని అక్కడి వైద్యులు తెలిపారు కానీ తరువాత, వైట్ హౌస్ సిబ్బంది ప్రధాన అధికారి, ట్రంప్ ఆరోగ్యం పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన నాలుగు నిముషాల వీడియోలో ట్రంప్, వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ వైద్యులకు, నర్సులకు కృతజ్ఞతలు తెలిపారు.
"నేనిక్కడికొచ్చినప్పుడు నా ఆరోగ్య పరిస్థితి అంత బాగాలేదు. కానీ, ఇప్పుడు ఎంతో మెరుగైంది. అయితే, రానున్న కొద్ది రోజుల్లో అసలు పరీక్ష ఎదురుకానుంది. తరువాత ఏం జరుగుతుందో చూడాలి" అని ట్రంప్ తెలిపారు.
నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తిరిగి పాల్గొనాలని కోరుకుంటునట్లు ఆయన తెలిపారు.
ట్రంప్ చికిత్స ఎలా కొనసాగుతోంది...
ట్రంప్‌కు అదనపు ఆక్సిజన్ ఇవ్వట్లేదని, గత 24 గంటలుగా ఆయనకు జ్వరం ఏమీ రాలేదని శనివారం ఉదయం డాక్టర్ సీన్ కాన్లే తెలిపారు.
ఆయన మరికొన్ని రోజులు వాల్టర్ రీడ్ ఆస్పత్రిలోనే ఉంటారని వైట్ హౌస్ తెలిపింది.
ట్రంప్ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతారో కచ్చితంగా చెప్పలేం కానీ ఆయన ఆరోగ్య పరిస్థితి ఆశాజనకంగానే ఉంది అని డా. కాన్లే తెలిపారు.
అయితే, ట్రంప్ ఆరోగ్యంపై వైట్ హౌస్ సిబ్బంది ప్రధాన అధికారి మార్క్ మెడోస్ ఆందోళన వ్యక్తం చేసారు. ఆయన పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు.
ట్రంప్ ఆరోగ్య పరిస్థితిని తెలిపే కీలకమైన సంకేతాలు గత 24 గంటలలో కొంత ఆందోళనకరంగా ఉన్నాయని, రాబోయే 48 గంటలు చాలా ముఖ్యమైనవని మార్క్ మెడోస్ రిపోర్టలకు తెలిపారు.
74 ఏళ్ల ట్రంప్‌కు కోవిడ్ 19 చికిత్సలో భాగంగా కాక్‌టైల్ ఇంజెక్షన్, యాంటీవైరల్ మెడిసిన్ ఇస్తున్నారు.
ట్రంప్ సహచరి, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌కు కూడా కోవిడ్ 19 సోకిన సంగతి తెలిసిందే.
అయితే, ఆవిడ ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని, ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నారని వైట్ హౌస్ తెలిపింది.
శుక్రవారం ఉదయం తనకు కోవిడ్ 19 పాజిటివ్ నిర్థారణ అయినట్లు ట్రంప్ ప్రకటించారు. తరువాత ఎన్నికల ప్రచారాలను తాత్కాలికంగా నిలిపివేసారు. పోలింగ్‌కు ముందే కొత్త సుప్రీం కోర్టు జడ్జ్ నియామకంపై సందేహాలు వ్యక్తం చేసారు.
ఇవి కూడా చదవండి:
- హాథ్రస్ కేసు: ఆమె నాలుక తెగడం, వెన్నెముక విరగడం... అన్నీ అబద్ధాలా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- పదేళ్ల వయసులో ఇల్లొదిలి వెళ్లాడు.. ఎన్నో కష్టాలు పడ్డాడు.. ఇప్పుడు రూ. 2.4 కోట్లకు ఐపీఎల్లో ఆడుతున్నాడు
- కోకాకోలా, మొసలిపేడ, పంది పేగులు... గర్భం రాకుండా పూర్వం వీటితో ఏం చేసేవారో తెలుసా?
- కొళాయి నీళ్లలో మెదడును తినేసే సూక్ష్మజీవులు.. ఆ నీళ్లు వాడొద్దంటూ అధికారుల వార్నింగ్
- కశ్మీర్ సమస్య పరిష్కారం కానిదే దక్షిణాసియాలో శాంతి అసాధ్యం: ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)