You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: దిల్లీలో కోవిడ్-19 బారినపడినవారిలో మహిళలే అధికం
దేశ రాజధాని దిల్లీలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడినట్లు తాజా సర్వేలో తేలింది.
రెండో విడత నిర్వహించిన యాంటీబాడీ టెస్టుల్లో ఈ విషయం వెల్లడైంది.
దిల్లీలో 15 వేల మందికిపైగా ప్రజలకు రక్త పరీక్షలు చేయగా వారిలో మూడోవంతు మందిలో కోవిడ్-19 యాంటీబాడీస్ గుర్తించారు.
జులైలో నిర్వహించిన మొదటి విడత సర్వేలో 23.48 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్ కనిపించాయి.
దిల్లీలో ఇప్పటివరకు 1,50,000కు పైగా పాజిటివ్ కేసులు, 4,257 మరణాలు నమోదయ్యాయి.
తాజాగా ఆగస్టులో నిర్వహించిన రెండో విడత సర్వేలో 32.2 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్ ఉన్నట్లు తేలింది. మగవాళ్ల విషయానికొస్తే 28.3 శాతం మందిలో కోవిడ్ యాంటీ బాడీస్ కనిపించాయి.
అయితే, దీనికి గల కారణాలపై మాత్రం స్పష్టత లేదు.
మొత్తంగా రక్త పరీక్షలు చేయించుకున్నవారిలో 29 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీస్ గుర్తించారు.
అంటే దిల్లీలోని 2 కోట్ల జనాభాలో 60 లక్షల మంది కరోనావైరస్ బారినపడి కోలుకున్నట్లు.
29 శాతం మంది ప్రజల్లో కోవిడ్‌ను తట్టుకునే శక్తి ఉండడం మంచిదే కానీ హెర్డ్ ఇమ్యూనిటీకి ఇది ఇంకా సుదూరంగానే ఉందని.. 40 నుంచి 70 శాతం మంది ప్రజల్లో కోవిడ్‌ను తట్టుకునే రోగ నిరోధక శక్తి డెవలప్ అయితేనే హెర్డ్ ఇమ్యూనిటీ ఉన్నట్లు భావించాలని దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ అన్నారు.
దిల్లీలాగే తీవ్రంగా ప్రభావితమైన ముంబయి, పుణెల్లో ఇంకా ఎక్కువ శాతం ప్రజల్లో యాంటీబాడీస్ గుర్తించారు.
పుణెలో రక్తపరీక్షలు జరిపినవారిలో సగం కంటే ఎక్కువ మందిలో కోవిడ్ యాంటీ బాడీస్ గుర్తించారు.
ఇలాంటి అధ్యయనాలు చాలా కీలకమని.. ఇవి అధికారులు, ప్రభుత్వాలు వ్యాధి సరళి, తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయని నిపుణులు అంటున్నారు.
జూన్ మొదటివారం నాటికి దేశంలో అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాల్లో దిల్లీ కూడా ఒకటి. అక్కడ కరోనా రోగులకు ఆసుపత్రి బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఉండేది. ఆ తరువాత నుంచి ప్రభుత్వం ఆసుపత్రి వసతి పెంచింది. అదే సమయంలో రోజువారీ నమోదయ్యే కేసుల సంఖ్యా తగ్గుతూ వచ్చింది.
కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- చంద్రప్రభ సైకియాని: అసోంలో పర్దా పద్ధతికి తెరదించడంలో కీలకపాత్ర పోషించిన వనిత
- ఐపీఎల్ 2020: తొలి టైటిల్ కోసం ఉవ్విళ్లూరుతున్న దిల్లీ, పంజాబ్, బెంగళూరు.. బలమైన పొజిషన్లో ముంబయి, చెన్నై
- మహిళల ఆరోగ్యం: ఇంటిపని చేయడం వ్యాయామం కిందకు వస్తుందా?
- 'మోదీజీ, మా ఆయన ఇంటి పనిలో సాయం చేయడం లేదు, మీరైనా చెప్పండి...'
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- వంట చేశాడు... ఇల్లు ఊడ్చాడు... హింసించే భర్త మనిషిగా మారాడు
- ప్రపంచంలోనే అత్యంత చల్లని కంప్యూటర్... ఇది శత్రు విమానాల్ని అటాక్ చేస్తుందా?
- నిజాయితీగా పన్ను చెల్లించేవారికి కొత్త ప్రయోజనాలు ఉంటాయన్న మోదీ
- ముస్లిం పెళ్లి కూతురు, క్రైస్తవ పెళ్లి కొడుకు... హిందూ సంప్రదాయంలో పెళ్లి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)