ఈ ఊళ్లో పిల్లలకు పేర్లు ఉండవు

వీడియో క్యాప్షన్, ఈ ఊళ్లో పిల్లలకు పేర్లు ఉండవు

మేఘాలయ రాష్ట్రం కాంగ్‌థోంగ్ గ్రామంలో పిల్లలకు పేర్లు ఉండవు. మరి, వారిని ఎలా పిలుస్తారనే సందేహం రావొచ్చు.

పేర్లకు బదులు తల్లిదండ్రులు పాటలు పాడి వారిని పిలుస్తారు. ప్రతి చిన్నారికి ఒక పాట ఉంటుంది.

పిల్లలు పెద్దవారైనా వారి పాట మాత్ర అలానే ఉంటుంది. కానీ, పెద్దయ్యాక పేరు పెడతారు.

కొందరు తల్లులు పాడే పాట చాలా చిన్నగా ఉంటుంది.. కానీ, మరికొందరు తల్లులు మాత్రం తమ పిల్లలను పెద్దపెద్ద పాటలతో పిలుస్తారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)