కేరళలో ఏనుగు మృతి: బాంబులు పెట్టిన పైనాపిల్ తినిపించి ఏనుగును చంపేశారు
కేరళలో నీలంబూర్ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఒక ఏనుగుకు కొందరు పేలుడు పదార్ధాలు నింపిన అనాసపండుని తినిపించారు. అది తిన్న ఏనుగు చనిపోయింది.
సుమారు14-15 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ ఏనుగు గర్భంతో ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
గాయపడిన తరువాత వెల్లియార్ నదిలో మూడు రోజులుగా చిక్కుపడిపోయిన ఆ ఏనుగుని బయటకి తీసుకుని రావడానికి అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఏనుగు తొండంతో సహా నీటిలో కూరుకుపోయింది.
"ఏనుగుకి గాయం ఎక్కడయిందో కూడా మాకు అర్ధం కాలేదు. అది నీటిలో చిక్కుకుని ఉన్నంత సేపు కేవలం నీరు మాత్రమే తాగింది. ఏనుగు దవడల రెండు వైపులా బాగా గాయాలై దాని దంతాలని కూడా కోల్పోయినట్లు" పాలక్కాడ్ లోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ , వన్య జీవుల సంరక్షకుడు శామ్యూల్ పచావ్ చెప్పారు.
ఆ ఏనుగు మే 25వ తేదీన దగ్గరలో ఉన అడవుల్లోకి ఆహారం కోసం వెళ్లినట్లు గుర్తించారు. అక్కడికి వెళ్ళినప్పుడు పొరపాటున నీటిలో చిక్కుపడి బయటకి రాలేకపోయిందని, కడుపులో ఉన్న బిడ్డకి ఆహారం కోసం ఆ పండు తిని ఉండవచ్చని పాలక్కాడ్ జిల్లా మన్నార్కాడ్ అటవీ శాఖ అధికారి సునీల్ కుమార్ అభిప్రాయపడ్డారు.
రాపిడ్ రెస్పాన్స్ టీం కి చెందిన మోహన్ కృష్ణన్ అనే అటవీ శాఖ అధికారి రాసిన ఫేస్ బుక్ పోస్ట్ తో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: 'పది అడుగుల ఎత్తు నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నాను...' - కరాచీ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ జుబైర్
- తెలంగాణ: ‘రెండేళ్ల కిందట తప్పిపోయి, 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నాన్నను టిక్‌టాక్ చూపించింది’
- రెండో ప్రపంచ యుద్ధంలో బాంబుదాడుల నుంచి బతికి బయటపడ్డ మొసలి ఇప్పుడు మృతి
- జాక్ మా: కరోనావైరస్ను కట్టడి చేయాలని, చైనా ప్రతిష్ఠను పునరుద్ధరించాలని ప్రయత్నిస్తున్న మహా కోటీశ్వరుడు
- ఓ వైపు యుద్ధం - మరోవైపు కరోనావైరస్.. తీవ్ర ప్రమాదంలో కామెరూన్ ప్రజలు
- అమెరికా డాలర్ కనుమరుగవుతుందా? చైనా డిజిటల్ యువాన్ రాజ్యం చేస్తుందా?
- సంక్షేమానికి, వివాదాలకూ రారాజు జగన్
- కరోనావైరస్లో వందల సంఖ్యలో కొత్త మ్యుటేషన్లు: పరిశోధనలో ఉన్న వ్యాక్సీన్లు పనికి రాకుండా పోతాయా?
- నరేంద్ర మోదీ వారసుడు అమిత్ షాయేనా?
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
- గృహ హింస: ‘లాక్డౌన్ నాకు ఆలోచించుకునేంత సమయం ఇచ్చింది.. నా భర్త నుంచి నేను విడిపోవాలనుకుంటున్నా’
- వరంగల్ హత్యలు: ‘‘ఒక మహిళను చంపేసి.. అది బయటపడుతుందని మరో 9 మందిని చంపేశాడు’’
- రెండు ఖండాల్లో, 28 మారు పేర్లతో 26 సంవత్సరాలుగా తప్పించుకు తిరిగాడు.. చివరికి ఎలా దొరికిపోయాడంటే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)