తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా దత్తాత్రేయ

ఫొటో సోర్స్, facebook/BandaruDattatreya
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ నియమితులయ్యారు.
తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.
ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కల్రాజ్ మిశ్రాను రాజస్థాన్ గవర్నర్‌గా బదిలీ చేశారు.
మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కొష్యారీ నియమితులయ్యారు.
కేరళ గవర్నర్‌గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఈరోజు ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇప్పటి వరకూ తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఈఎస్ఎల్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన విద్యాసాగర్ రావు, కేరళ గవర్నర్‌గా ఉన్న సదాశివంలను బాధ్యతల నుంచి తప్పించారు.
అయితే, వీరికి తదుపరి మరేమైనా రాష్ట్రాల బాధ్యతలు ఇస్తారా? అన్న అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

ఫొటో సోర్స్, facebook/DrTamilisaiBJP
తమిళిసై సౌందరరాజన్
2014వ సంవత్సరం నుంచి తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్న తమిళిసై సౌందరరాజన్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు.
ఎంబీబీఎస్ చదివి గైనకాలజిస్ట్‌గా పనిచేసిన ఆమె ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ప్రతిసారీ ఓటమి చవిచూశారు. సార్వత్రిక ఎన్నికల్లో తూతుక్కుడి లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగిన ఆమె డీఎంకే నాయకురాలు కనిమొళి చేతిలో ఓటమి పాలయ్యారు.
తమిళిసై తండ్రి కుమరి ఆనందన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడిగా పని చేశారు.

ఫొటో సోర్స్, facebook/LabourMinistry
బండారు దత్తాత్రేయ
1965లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరిన బండారు దత్తాత్రేయ ప్రచారక్‌గా పనిచేశారు. 1970ల్లో ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యారు. 1980లో బీజేపీలో చేరారు.
సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1991, 1998, 1999, 2014 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి, పార్లమెంటు సభ్యుడు అయ్యారు.
వాజ్‌పేయీ హయాంలో కేంద్ర పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన, రైల్వే శాఖకు సహాయ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ (స్వతంత్ర) మంత్రిగా పనిచేశారు. నరేంద్ర మోదీ హయాంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ (స్వతంత్ర) మంత్రిగా పనిచేశారు.
కాగా, 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు.
ఇవి కూడా చదవండి:
- దళితులు: వివక్ష, కట్టుబాట్ల మీద పెరుగుతున్న ధిక్కారానికి కారణమేమిటి? ఈ ఘర్షణలు ఎటు దారితీస్తాయి?
- ఎన్ఆర్సీ: ‘ఇక్కడే పుట్టాం.. ఇక్కడే బతికాం.. ఇప్పుడెక్కడికి పోతాం?’ - అస్సాం పౌరసత్వ జాబితాలో పేరు లేని లక్షలాది మంది ఆవేదన
- WIvIND: బుమ్రా హ్యాట్రిక్, విహారి శతకం, ఇషాంత్ హాఫ్ సెంచరీ
- ప్రభాస్ 'సాహో' సినిమా ఏం చెప్పాలనుకుంది?
- ‘బెయిలూ ఇవ్వడం లేదు.. కేసు విచారణ సాగనివ్వడం లేదు.. ఎటూ తేల్చకుండా ఎన్నాళ్లు జైల్లో పెడతారు’
- ట్రంప్ కార్యాలయం నుంచి ఈ మహిళను ఎందుకు తొలగించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)









