చెన్నై నగరంలో నీటి కరువు.. నీటి కోసం పోరాడుతున్న నగరవాసులు

చెన్నై మహిళ

''ట్యాంకుల ద్వారా అందిస్తున్న నీరు మాకు చాలడం లేదు. కుళాయిల్లో నీళ్లు రావట్లేదు. నీటి కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. ఇంతకన్నా మేము ఏం చేయగలం? కార్పొరేషన్ అధికారులను అడిగితే ట్యాంకర్ల నుంచి నీటిని తీసుకోవాలని చెబుతున్నారు. నీటి కోసం అటు ఇటు పరుగులు పెడుతున్నాం'' ఇది ఓ చెన్నై మహిళ ఆవేదన.

చెన్నై మెట్రో వాటర్ విభాగం, ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తోంది. నీటి సరఫరా సక్రమంగా జరగడానికి చెన్నై నగరాన్ని 15 జోన్లుగా విభజించారు.

వీడియో క్యాప్షన్, వీడియో: చెన్నై నగరంలో నీటి కరువు.. నీటి కోసం పోరాడుతున్న నగరవాసులు

‘‘ఈ ప్రాంతంలో దాదాపు 800 కుటుంబాలు జీవిస్తున్నాయి. కేవలం మూడు లారీ ట్యాంకర్ల నీళ్లు వస్తాయి. వాటిలో ఒక ట్యాంకర్‌ ఉచితంగా ఇస్తారు. మరో రెండు ట్యాంకర్లకు డబ్బులు చెల్లించాలి. ఆ కొద్ది పాటి నీళ్లు మాకు సరిపోవు. ఉచితంగా మరింత నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. నీటి కోసం పగలూ రాత్రి కష్టపడుతున్నాం. అటు ఇంటి పనులు, ఇటు పిల్లల్ని చూసుకుంటూ నీళ్ల కోసం వెళ్లాలంటే చాలా కష్టంగా ఉంటుంది. బయటకెళ్లి పని చేస్తేనే పూట గడుస్తుంది. కానీ నీటి కొరత మమ్మల్ని ఏ పనికి వెళ్లనివ్వడం లేదు'' అని మరో వ్యక్తి బీబీసీతో అన్నారు.

చెన్నై మెట్రో ప్రతిరోజూ 9వేల లారీ ట్యాంకర్లతో 52.5 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తుంది.

డబ్బులిచ్చి నీటిని కొనుక్కుందామనుకున్నా అందుకోసం రిజిస్టర్ చేసుకోవాలి. అంతేకాక, ట్యాంకర్ కోసం 20 రోజలు వేచి చూడాల్సిన పరిస్థితి. భవిష్యత్తులో ఈ సమయం మరింత పెరగొచ్చు కూడా.

మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)