ఏఎన్ 32: చైనా సరిహద్దుకు సమీపంలో మాయమైన భారత్ వాయుసేన విమానం

ఫొటో సోర్స్, EPA
భారతీయ వాయుసేన విమానం ఏఎన్-32.. అసోంలోని జోర్‌హాట్ నుంచి పైకెగిరిన తర్వాత కనిపించకుండా పోయింది.
ఈ విషయంపై భారతీయ వాయుసేన అధికార ప్రతినిధి వింగ్ కమాండర్ రత్నాకర్ సింగ్ స్పందిస్తూ.. విమానంలో పైలట్ల బృందానికి సంబంధించి 8 మందితో పాటు మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారని, వీరంతా వాయుసేనకు సంబంధించినవారేనని చెప్పారు.
జోర్‌హాట్ నుంచి మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల సమయంలో బయలుదేరిన ఈ విమానం అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుంగా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంది.
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వద్ద చివరిసారిగా మధ్యాహ్నం ఒంటి గంటకు విమానం ప్రయాణ వివరాలు నమోదయ్యాయి.
అయితే, నిర్ణీత సమయానికి విమానం మెచుంగా చేరుకోకపోవటంతో వాయుసేన విమానం కోసం వెతుకులాట ప్రారంభించింది.
అందుబాటులో ఉన్న అన్ని సాధనాలతో విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని రత్నాకర్ సింగ్ తెలిపారు.
గాలింపు చర్యల కోసం సుఖోయ్ 30, సీ 130 హెర్క్యులస్ విమానాలను ఉపయోగిస్తున్నామని, భారతీయ సైన్యం, ఇండో-టిబెటన్ సరిహద్దు రక్షణ దళం సహాయాన్ని కూడా తీసుకుంటున్నామని రత్నాకర్ సింగ్ స్థానిక విలేకరి దిలీప్ కుమార్ శర్మాతో చెప్పారు.

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
గాలింపు చర్యలపై రక్షణ మంత్రి ఆరా
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాయమైన విమానం ఆచూకీ, గాలింపు చర్యల వివరాలపై ఆరా తీశారు.
‘‘ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ భదౌరియాతో మాట్లాడాను. అదృశ్యమైన విమానాన్ని వెదికేందుకు భారతీయ వాయుసేన తరపున తీసుకున్న చర్యలను ఆయన వెల్లడించారు. విమానంలోని ప్రయాణీకుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను’’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.
భారతీయ వాయుసేన చరిత్రలో అత్యంత భారీ గాలింపు చర్య అదే
2016లో కూడా భారతీయ వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం ఒకటి అదృశ్యమైంది. చెన్నై నుంచి అండమాన్, నికోబార్ దీవులకు బంగాళాఖాతం మీదుగా వెళుతూ ఆ విమానం కనిపించకుండా పోయింది.
అప్పట్లో విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ముమ్మర గాలింపు జరిగింది. భారతీయ వాయుసేన చరిత్రలో అత్యంత భారీ గాలింపు చర్య అదే. అయినప్పటికీ విమానం ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఆ విమానంలో 29 మంది ప్రయాణిస్తున్నారు.
ఏఎన్-32 విమానం ప్రత్యేకతలేంటి?
ఏఎన్-32 లేదా ఆంటొనోవ్-32 అని పిలిచే ఈ విమానం సైన్యానికి అవసరమైన సరుకులను రవాణా చేసే విమానం.
భారతీయ వాయుసేన 1984 నుంచి ఈ విమానాలను వినియోగిస్తోంది.
వీటిని ఉక్రెయిన్‌కి చెందిన పంతొనోవ్ స్టేట్ కార్పొరేషన్ డిజైన్ చేసింది.
ఏఎన్-32 విమానాలను సంక్లిష్ట వాతావరణ సమయాల్లో కూడా ఆధారపడదగ్గ విమానం అని భావిస్తుంటారు. భారతీయ వాయుసేన ఎన్నో ఆపరేషన్లలో దీనిని వినియోగించింది.
ఏడున్నర టన్నుల బరువును ఈ ఏఎన్-32 విమానం మోసుకెళ్లగలదు. రెండు ఇంజిన్ల ఈ విమానం గంటకు 530 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
ఇవి కూడా చదవండి:
- భారత వాయుసేన వార్ గేమ్: ఏమిటీ ’గగన్‌శక్తి 2018‘?
- హైపర్సోనిక్ ప్యాసింజర్ విమానాన్ని తయారు చేస్తున్న చైనా. ఎందుకు?
- ప్రతాప్ చంద్ర సారంగి: సాధారణంగా కనిపించే ఈయన గతం వివాదాస్పదమే
- పైలట్లకు ఇంగ్లిష్ రాకపోవడమే విమాన ప్రమాదాలకు కారణమా?
- 2018లో పెరిగిన విమాన ప్రమాద మరణాలు.. ఒక్క ఏడాదే 556 మంది చనిపోయారు
- ప్రపంచవ్యాప్తంగా 737 మాక్స్ 8 విమానాలను నిలిపేసిన బోయింగ్
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానం ఏంటి? ఈ విమానాలు ఎందుకు కూలిపోతున్నాయి?
- మయన్మార్: ముందు చక్రాలు లేకున్నా క్షేమంగా విమాన ల్యాండింగ్
- యుద్ధ విమానం అనుకుని సాధారణ పౌరులు ప్రయాణిస్తున్న విమానం కూల్చేసిన అమెరికా
- బోయింగ్ 737 మాక్స్ 8 విమానాలు భారత్‌లో ఎన్ని ఉన్నాయి? ఏఏ విమానయాన సంస్థలు వీటిని నడుపుతున్నాయి?
- నమ్మకాలు-నిజాలు: పీరియడ్స్ ఆపే మాత్రలు వేసుకోవడం మంచిదా, కాదా
- లిప్‌స్టిక్ తయారీకి వాడే గింజలు ఇవే... ఆంధ్రప్రదేశ్‌లోనూ జోరుగా సాగు
- దిల్లీ మెట్రో రైలు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం - అరవింద్ కేజ్రీవాల్
- ఈ ఐదు టిప్స్ పాటిస్తే మహిళలు తమ కెరీర్లో రాకెట్లా దూసుకుపోవచ్చట
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










