పయ్యావుల కేశవ్ గెలిస్తే ఏపీలో టీడీపీ ఓడిపోతుందనే ప్రచారంలో నిజమెంత? 1994లో ఏమైంది?

ఫొటో సోర్స్, Facebook
రాయలసీమలో ఆ మాటకొస్తే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువ ఆసక్తి కలిగించే శాసనసభ నియోజకవర్గాల్లో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ గెలిస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలోకి రాదనే ప్రచారం ఉంది.
ఇంతకీ ఈ ప్రచాంలో నిజమెంత? ఆయన గెలిస్తే నిజంగా టీడీపీ అధికారంలోకి రాదా? దీనిపై పరిశీలన జరిపితే ఈ ప్రచారం ఆవాస్తవమని తేలింది.
1994లో గెలిచిన కేశవ్... అధికారంలో టీడీపీ
తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత, 1983 నుంచి 2019 వరకు మొత్తం తొమ్మిదిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 1983, 1985, 1994, 2004, 2009, 2019 ఎన్నికల్లో ఉరవకొండలో టీడీపీ విజయం సాధించింది.
పయ్యావుల కేశవ్ తొలిసారిగా ఉరవకొండ నుంచి 1994 ఎన్నికల్లో పోటీచేసి గెలిచారు. అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ, ఆ తరువాత పయ్యావుల మూడుసార్లు గెలిచారు.
ఆ మూడు సార్లు టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. 1999, 2014లలో పయ్యావుల ఓటమి పాలవగా ఆ ఏడాది టీడీపీ అధికారంలోకి వచ్చింది.
చరిత్రను గమనిస్తే పయ్యావుల కేశవ్ గెలిస్తే, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాదనే ప్రచారం అవాస్తవని తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
- నడిచొచ్చే నాయకులకు కలిసొచ్చే అధికారం
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 2019: కీలకమైన ఈ 10 నియోజకవర్గాల్లో గెలిచేదెవరో...
- ఎన్టీఆర్ ఫొటో ఎంత పని చేసిందంటే...
- ఇందిరాగాంధీని కాంగ్రెస్ నుంచి బహిష్కరించిన ఆంధ్రా లీడర్
- ఈవీఎంలో ఓట్లు ఎలా లెక్కిస్తారు?
- LIVE: నిజామాబాద్లో కవిత వెనుకంజ, మల్కాజిగిరిలో రేవంత్ ముందంజ : ఏపీ, తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలు
- పార్టీలు పెట్టారు.. కాపాడుకోలేకపోయారు
- 'ఈవీఎం ధ్వంసం'పై జనసేన అభ్యర్థి బీబీసీతో ఏమన్నారంటే..
- తెలంగాణలో ఒక్క లోక్సభ స్థానానికి 480 మంది అభ్యర్థులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




