మోదీ రోడ్‌షో అంటూ వాజ్‌పేయీ అంతిమయాత్ర వీడియోను షేర్ చేస్తున్నారా?- BBC Fact Check

మోదీ, వాజ్‌పేయీ అంతిమ యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
    • హోదా, బీబీసీ న్యూస్

నరేంద్ర మోదీ భారీ జనసందోహంతో వారణాసిలో లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్నట్టుగా చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

"గౌరవనీయులు నరేంద్ర మోదీ తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు వెళ్తున్నారు" అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టారు.

పూల దండలతో అలంకరించిన వాహనం వెనుక మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుండటాన్ని చూడొచ్చు. వారివెనుక భద్రతా సిబ్బంది, భారీ ఎత్తున జనం వెళ్తున్నారు.

గురువారం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసిలో నరేంద్ర మోదీ రోడ్‌ షో నిర్వహించిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఏప్రిల్ 26న వారణాసిలో ఆయన నామినేషన్ వేశారు.

వీడియో

ఫొటో సోర్స్, SM Viral Posts

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో ఈ వీడియోను వేలసార్లు షేర్ చేశారు.

రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను ఫేస్‌బుక్, ట్విటర్‌లో వేలసార్లు షేర్ చేశారు.

రెండు వారాల క్రితం కూడా ఇదే తరహా క్యాప్షన్‌తో ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అప్పటికి నరేంద్ర మోదీ ఇంకా నామినేషన్ వేయలేదు.

"నామినేషన్ వేయడమంటే ఇది. మీరు కళ్లు తెరవండి, సింహం ఎలా నడుస్తోందో చూడండి" అని క్యాప్షన్ పెట్టారు.

అయితే, అది తప్పుడు వాదన అని మా పరిశీలనలో తేలింది. ఈ వీడియో పాతది. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలకు దానికి ఎలాంటి సంబంధం లేదు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది

వీడియోలో ఉన్న వాస్తవమేంటి?

ఈ వీడియో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ అంతిమయాత్రకు సంబంధించినది.

పూలదండలతో అలంకరించి ఉన్న ఆ వాహనంలో వాజ్‌పేయీ భౌతిక కాయం ఉంది.

రివర్స్ సెర్చ్ టూల్‌ ద్వారా వెతికినప్పుడు వాజ్‌పేయీ అంత్యక్రియలకు సంబంధించిన పలు మీడియా కథనాలు వచ్చాయి.

మోదీ, వాజ్‌పేయీ అంతిమ యాత్ర

ఫొటో సోర్స్, Getty Images

2018 ఆగస్టు 16న వాజ్‌పేయీ తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 17న అధికారిక లాంఛనాలతో దిల్లీలోని రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.

అంతకుముందు దాదాపు తొమ్మిది వారాలుగా దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందారు.

వాజ్‌పేయీ 1996లో 13 రోజులు, 1998లో 13 నెలలు, 1999 నుంచి అయిదేళ్లు దేశ ప్రధానిగా సేవలు అందించారు.

(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)