శ్రీలంక పేలుళ్లు: ఈ ఫొటోలు నిజమేనా?

ఫొటో సోర్స్, Social media
- రచయిత, ఫ్యాక్ట్ చెక్ బృందం
- హోదా, బీబీసీ న్యూస్
సోషల్ మీడియాలో కొన్ని భయానకమైన చిత్రాలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించినవి అంటూ వాటిని షేర్ చేస్తున్నారు.
ఈ చిత్రాలను ఇప్పటికే ట్విటర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వేలాది మంది చూశారు, షేర్ చేశారు.
"శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస బాంబు పేలుళ్లలో కుటుంబ సభ్యులను కోల్పోయినవారి కోసం ప్రార్థించండి" అంటూ క్యాప్షన్ పెట్టి ఈ ఫొటోలను పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు.
ఆదివారం శ్రీలంకలోని ప్రముఖ చర్చిలు, హోటళ్లలో జరిగిన అత్యంత హింసాత్మక పేలుళ్లలో 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని అక్కడి ప్రభుత్వం తెలిపింది. అయితే, ఆ పేలుళ్లకు, వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు ఎలాంటి సంబంధం లేదని మా పరిశీలనలో తేలింది.
పై చిత్రం శ్రీలంకకు చెందినదే. కానీ, అది ఇప్పటిది కాదు, ఇటీవలి దాడులతో దానికి ఎలాంటి సంబంధం లేదు.
గెట్టీ ఇమేజెస్ వెబ్‌సైట్ ప్రకారం, 2006 జూన్ 16న శ్రీలంకలోని కెబిటోగొల్లెవా ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగినప్పుడు తీసిన చిత్రాలు అవి.

ఫొటో సోర్స్, SOCIAL MEDIA
మీడియా కథనాల ప్రకారం, 2006 జూన్ 15న కెబిటోగొల్లెవా ప్రాంతంలో అత్యంత శక్తిమంతమైన మందుపాతర పేలడంతో ఒక బస్సు తీవ్రంగా దెబ్బతింది.
తమిళ టైగర్స్ చేసినట్లుగా భావించిన ఆ బాంబు దాడిలో 15 మంది చిన్నారులు సహా, 64 మంది ప్రాణాలు కోల్పోయారు.
"అతిపిన్న బాధితుడు"
ఆదివారం జరిగిన పేలుళ్లలో చనిపోయిన అతిపిన్న వయస్కుడు ఇతడే అంటూ బాలుడి శవం వద్ద ఒక వ్యక్తి ఏడుస్తూ ఫొటో కూడా వైరల్ అయ్యింది.
ఆ ఫొటోను "ఆస్ట్రేలియన్ కాప్టిక్ హెరిటేజ్ అండ్ కమ్యూనిటీ సర్వీసెస్" పేరుతో ఉన్న ఫేస్‌బుక్ పేజీలోనూ ఆ ఫొటోను పోస్ట్ చేశారు. దానిని 3,000 సార్లకు పైగా షేర్ చేశారు.
"అబ్బే రోడ్స్" పేరుతో ఉన్న మరో బ్లాగ్ కూడా 2019 ఏప్రిల్ 22న ఈ ఫొటోను పోస్ట్ చేసింది. "కొలంబో దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి" అని క్యాప్షన్ పెట్టారు.
ఇలా కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న ఈ ఫొటోలకు ఇటీవలి శ్రీలంక బాంబు పేలుళ్లతో ఎలాంటి సంబంధం లేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఆ ఫొటోలను షేర్ చేస్తున్నారని బీబీసీ ఫ్యాక్ట్ చెక్ బృందం జరిపిన పరిశీలనలో వెల్లడైంది.
గూగుల్ రివర్స్ ఇమేజ్ టూల్ సాయంతో వెతికినప్పుడు ఇవే ఫొటోలు గతేడాది మే నెలలలో కూడా ఫేస్‌బుక్‌లో పట్ట వాడన్ అనే యూజర్ షేర్ చేశారు.
(ఇలాంటి అనుమానాస్పద వార్తలు, ఫొటోలు, వీడియోలు లేదా సమాచారం ఏదైనా మీ దృష్టికి వస్తే, వాటి ప్రామాణికతను పరిశీలించడానికి బీబీసీ న్యూస్ వాట్సాప్ నెంబర్ +919811520111 కు పంపించండి లేదా ఇక్కడ క్లిక్ చేయండి.)
ఇవి కూడా చదవండి:
- అందరికీ మరుగుదొడ్లు కల్పిస్తామన్న మోదీ హామీ నెరవేరిందా...
- Reality Check: రుణ మాఫీ పథకాలతో రైతుల కష్టాలు తీరుతాయా?
- BBC Reality Check: విమానాశ్రయాల నిర్మాణాలపై బీజేపీ లెక్కల్లో నిజమెంత?
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- అంతరిక్షంలో అత్యధికంగా చెత్త నింపే దేశం ఏదో తెలుసా...
- BBC Reality Check: భారత దేశంలో నిరుద్యోగం పెరిగిందా? లేక తగ్గిందా?
- ఈ మరుగుజ్జు గ్రహానికి పేరు పెట్టే ఛాన్స్ మీదే
- 1.. 2.. 3.. సంగతి సరే.. అసలు సున్నా ఎలా పుట్టింది? దీన్ని భారతీయులు ఎలా కనిపెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








