లోక్‌సభ ఎన్నికలు 2019: నరేంద్ర మోదీ హామీలు ఎంతమేర అమలుచేశారు? - BBC Reality Check

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సమీహ నెట్టిక్కర
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పెద్దయెత్తున సాగుతోంది. తొలి దశ పోలింగ్ ఈ నెల 11న గురువారం జరుగనుంది. ఓటర్ల సంఖ్య పరంగా చూస్తే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దేశంలో సుమారు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.
ఐదేళ్ల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, మరోసారి బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ)ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు ప్రధాన విపక్షం- అన్ని కీలక అంశాల్లో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది.
ఇంతకూ మోదీ ప్రభుత్వం బీజేపీ హామీలను ఎంత మేర నిలబెట్టుకుంది? అందుబాటులో ఉన్న సమాచారం, గణాంకాలతో బీబీసీ రియాలిటీ చెక్ బృందం వివిధ అంశాలపై ఈ కోణంలో విశ్లేషణ జరుపుతోంది.
భారత్ భద్రత
ఫిబ్రవరిలో పాకిస్తాన్ కేపీకే రాష్ట్రంలోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడులు జరిపిన తర్వాత, భారత దేశానికి సిసలైన రక్షణ కవచం తామేనని మోదీ ప్రభుత్వం చెప్పుకొంది.

ఫొటో సోర్స్, Getty Images
యూపీఏ హయాంతో పోలిస్తే మోదీ హయాంలో కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు దిగజారాయని కాంగ్రెస్ విమర్శించింది.
2018 చివరి వరకున్న సమాచారాన్ని బట్టి చూస్తే, రెండు ప్రభుత్వాల హయాంలోనూ మిలిటెంట్ కార్యకలాపాలు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. 2009-13 మధ్య కాలంలో మొత్తం 1717 ఘటనలు నమోదయ్యాయి. 2014-18 మధ్యలో ఇంతకన్నా కొద్దిగా తక్కువగా 1708 ఘటనలు జరిగాయి.
అయితే 2016 నుంచి భారత పాలిత కశ్మీర్‌లోకి చొరబాటు యత్నాలు పెరుగుతున్నాయి.
తయారీ రంగం: భారత్ సూపర్ పవర్ అయ్యిందా?
2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచుతామని 'మేక్ ఇన్ ఇండియా' విధానం కింద మోదీ ప్రభుత్వం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇటీవలి సంవత్సరాల్లో ఇది కేవలం 15 శాతంపైనే ఉంది. 2025లోగా లక్ష్యాన్ని అందుకోగలమా అనే సందేహాన్ని నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థ పురోగతి మాత్రం కొనసాగుతోంది.

మహిళలకు భద్రత పెరిగిందా?
మహిళల భద్రత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది.
మహిళలపై హింసను అడ్డుకొనేందుకు కఠినమైన చట్టాలు తెచ్చామని మోదీ ప్రభుత్వం పేర్కొంటోంది.

ఫొటో సోర్స్, Getty Images
అత్యాచార కేసుల నమోదు పెరిగిందని, ముఖ్యంగా 2012 నిర్భయ అత్యాచారం తర్వాత పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.
గత కొన్నేళ్లలో నేర నిర్ధరణ కేసుల రేటు మెరుగుపడలేదు.
మహిళలపై హింసను నివారించేందుకు, వారిపై హింసకు పాల్పడేవారిని శిక్షించేందుకు చేపట్టిన చర్యలను బీబీసీ పరిశీలించింది.

ఫొటో సోర్స్, Getty Images
గ్రామీణ భారతం పరిస్థితి?
2022లోగా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మూడేళ్ల క్రితం ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకొనే దిశగా ప్రభుత్వం సాగుతున్నట్లు కనిపించడం లేదు.
రైతులను ఆదుకొనేందుకు గతంలో వ్యవసాయ రుణాలను మాఫీ రూపంలో ఒక ప్రయత్నం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు పెరుగుతున్నాయని ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే జాతీయ కుటుంబ సర్వేలు చెబుతున్నాయి. 2017-18 సంవత్సరం నివేదిక ఇంకా విడుదల కాలేదు.

రుణమాఫీ పథకాల విషయంలో కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారు. వ్యవసాయ రంగ కష్టాలకు ఈ పథకాలు సరైన పరిష్కారాలు కాదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు నిజమే కావొచ్చని బీబీసీ పరిశీలన చెబుతోంది. రుణమాఫీ పథకాలు ఎన్నడూ ప్రభావవంతంగా అమలు చేయలేదు. ఈ పథకాల వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చని కూడా బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
వంటగ్యాస్ పథకం విజయవంతమైందా?
గ్రామాల్లోని కోట్ల కొద్దీ కుటుంబాలకు వంటగ్యాస్ సదుపాయం కల్పించేందుకు 2016లో 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పేరుతో ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది.

ప్రజలు కిరోసిన్, వంటచెరకు, పిడకల వాడకాన్ని తగ్గించి స్వచ్ఛమైన వంట ఇంధనం వైపు మళ్లేలా చేసేందుకు ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. చాలా కుటుంబాలు ఎల్‌పీజీ గ్యాస్ వైపు మళ్లాయి. ఈ పథకం విజయవంతమైంది. అయితే గ్యాస్ సిలిండర్ల ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా కుటుంబాలు సిలిండర్లను రీఫిల్ చేయించుకోలేకపోతున్నాయని, ఈ గ్యాస్ వాడకాన్ని కొనసాగించలేకపోతున్నాయని బీబీసీ పరిశీలనలో స్పష్టమైంది.
మరుగుదొడ్ల నిర్మాణం
ఇప్పుడు 90 శాతం మంది భారతీయులకు మరుగుదొడ్ల సదుపాయం ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ సంఖ్య 40 శాతంగా ఉంది.
మోదీ ప్రభుత్వం పెద్దసంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించింది.

అయితే అనేక మరుగుదొడ్లు సరిగా పనిచేయడం లేదు.
వివిధ కారణాల వల్ల వీటిని వాడటం లేదు.
గంగా నది ప్రక్షాళన
2020లోగా గంగానది ప్రక్షాళనకు రూ.20 వేల కోట్లు వెచ్చిస్తామని మోదీ ప్రభుత్వం 2014లో ప్రకటించింది. భారీగా నిధులు కేటాయించినప్పటికీ, అందులో అతి కొద్ది భాగమే ఖర్చుచేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గంగా నది ప్రక్షాళనలో కొంత పురోగతి ఉన్నా, వచ్చే ఏడాదిలోగా ఈ కార్యక్రమం పూర్తయ్యే పరిస్థితైతే లేదు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది

ఇవి కూడా చదవండి:
- రోజూ ఒక్క పెగ్గేసినా గుండెకు ముప్పే: ద లాన్సెట్
- లోక్‌సభ: పెరుగుతున్న బీజేపీ ప్రాబల్యం.. తగ్గుతున్న ముస్లిం ప్రాతినిధ్యం
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా.. కేసీఆర్ లక్ష్యం ఎంతవరకు నెరవేరుతుంది?
- ధవళేశ్వరం ఆనకట్ట: గోదావరి జిల్లాలను కరువు నుంచి సంపదలోకి తెచ్చిన ప్రాజెక్టు
- ‘వార్’సత్వం: వీళ్లకిది ఫస్ట్ టైం..
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- మద్యం అతిగా తాగితే... డీఎన్ఏ డామేజ్ అవుతుందా...
- నీరవ్ మోదీ: భారత్‌కు ఎలా రప్పిస్తారు? రూ.11,360 కోట్ల సంగతేంటి?
- పిండి పదార్థాలు తక్కువ తింటే ఆయుష్షు తగ్గుతుంది
- ఏపీ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠాను బదిలీ చేసిన భారత ఎన్నికల కమిషన్
- ఈమెకు నెల రోజుల్లో రెండు కాన్పులు, ముగ్గురు పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








