ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్: ‘మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. భారత్‌లో మాత్రం ఒకే కుటుంబం ఉంది’

ఫొటో సోర్స్, PENMOVIES/TRAILERGRAB/BBC
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జీవిత కథ ఆధారంగా తీసిన 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే సినిమా ట్రైలర్ గురువారం విడుదలైంది. ఆ ట్రైలర్ ఇప్పుడు ట్విటర్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. రాజకీయంగానూ దుమారం రేపుతోంది.
ఈ సినిమాలో వాస్తవాలను వక్రీకరించి చూపించారని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శిస్తుండగా, బీజేపీ నేతలు ప్రతివిమర్శలు చేస్తున్నారు.
ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్ర పోషించారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారూ రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో సంజయ్ బారూ పాత్రలో అక్షయ్ ఖన్నా నటిస్తున్నారు.
జనవరి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ట్రైలర్‌లో మన్మోహన్ సింగ్ మాటతీరును అనుపమ్ ఖేర్ అచ్చుగుద్దినట్లు అనుకరించిన తీరు చాలామందిని ఆకట్టుకుంది.
అయితే, 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ట్రైలర్‌లోని కొన్ని అంశాలు చర్చకు దారితీసే అవకాశం ఉంది.
ముందు ఈ ట్రైలర్‌లోని కొన్ని పాత్రల డైలాగులు చూద్దాం...
- డాక్టర్. సాబ్ ఒక భీష్ముడు లాంటివారని అనుకున్నాను. అందులో ప్రమాదమేమీ లేదు. కానీ, ఒక ఫ్యామిలీ డ్రామాలో ఆయన బాధితుడిగా మారారు.
- మహాభారతంలో రెండు కుటుంబాలు ఉండేవి. భారత్‌లో మాత్రం ఒకే కుటుంబం ఉంది.
- వంద కోట్ల మందికి పైగా జనాభా ఉన్న దేశాన్ని కొద్ది మంది వ్యక్తులు మాత్రమే పాలిస్తున్నారు.
- అణు ఒప్పందం కోసం జరిగిన పోరాటం మాకు పానిపట్టు యుద్ధం కంటే పెద్దది.
- దిల్లీ దర్బారులో ఒకే ఒక్క వార్త... అదేంటంటే.. ఎప్పుడు డాక్టర్. సాబ్‌ను కుర్చీ నుంచి దించేయాలి? ఎప్పుడు పార్టీ రాహుల్ జీకి అభిషేకం చేయాలి?
- నా విధులు నేను నిర్వర్తిస్తా, నాకు క్రెడిట్ అవసరం లేదు. ఎందుకంటే, అన్నింటి కంటే దేశమే నాకు ముఖ్యం.
- 'రాజీనామా చేయాలనుకుంటున్నాను'. అవినీతి కుంభకోణాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాహుల్ బాధ్యలను ఎలా తీసుకోగలరు?

ఫొటో సోర్స్, AFP
ఎవరీ సంజయ్ బారూ?
2004 నుంచి 2008 వరకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు మీడియా సలహాదారుగా సంజయ్ బారూ పనిచేశారు. ఈయన హైదరాబాద్‌లో జన్మించారు. తెలుగు బాగా మాట్లాడతారు.
ఆయనే, 'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకం మీద 2014లో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయం విమర్శలు చేసింది.
"ఏ ప్రభుత్వంలోనైనా రెండు అధికార కేంద్రాలు ఉండకూదు. అది ఆటంకాలు కలిగిస్తుంది. ఇప్పుడు పార్టీ అధినేతే అధికార బిందువుగా ఉన్నారన్న విషయాన్ని, పార్టీకి ప్రభుత్వం జవాబుదారీగా ఉందన్న విషయాన్ని నేను అంగీకరించక తప్పదు" అని మన్మోహన్ సింగ్ తనతో చెప్పారని సంజయ్ బారూ ఆ పుస్తకంలో రాశారు.
దానిపై ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సంజయ్ బారూ పుస్తకంలో నిరాధారమైన విషయాలను, అసత్యాలను పేర్కొన్నారని వ్యాఖ్యానించింది. ఆర్థిక ప్రయోజనాలు పొందాలన్న దురుద్దేశంతో ఆయన అలా రాశారని విమర్శించింది.

ఫొటో సోర్స్, AFP
ఆ పుస్తకంలో సంజయ్ బారూ ఇంకా ఏం రాశారు?
- 2009 ఎన్నికల్లో భారీ విజయం తర్వాత మన్మోహన్ సింగ్ నిస్సహాయ స్థితిలో పడిపోవడం నా ఊహకు కూడా అందలేదు. ఆయనకు తన సొంత కార్యాలయంలోనే కావాల్సిన అధికారి అపాయింట్‌మెంట్ దొరకనప్పుడు, త్వరలోనే తన స్థానాన్ని "ఇతరులకు" అప్పగించబోతున్నారని అర్థమైంది.
- సోనియా గాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి అప్పుడు అధికార కేంద్రంగా పనిచేసేది. ప్రభుత్వం తీసుకొచ్చే సామాజిక సంస్కరణల క్రెడిట్ కూడా ఆ మండలికే వెళ్తుండేది.
- మన్మోహన్ సింగ్ పట్ల అగౌరవం ఎంతగా ఉండేదంటే.. అమెరికా లాంటి దేశాల నుంచి విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వచ్చిన తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిసి తన పర్యటన వివరాలను వివరించడం తప్పనిసరి అని కూడా అనుకునేవారు కాదు.
- 2004లో ప్రధాని పదవిని సోనియా గాంధీ త్యజించడం ఆమె తన అంతరాత్మ చెప్తే చేసింది కాదు. అదొక రాజకీయ అడుగు.

ఫొటో సోర్స్, PENMOVIES
సినిమా ట్రైలర్ మీద సామాన్య ప్రజల స్పందన
"ఇది వచ్చే ఎన్నికల మీద ప్రభావం చూపుతుందని, ప్రస్తుత ప్రధానమంత్రికి సాయపడుతుందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో మంచి రాజకీయ డ్రామా ఉంటుందని భావిస్తున్నాను" అని అంకిత్ కుమార్ అన్నారు.
'ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్' ఒక మూగ సినిమా అవుతుంది అనుకుంటున్నాను అని కృష్ణ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
"మన్మోహన్ సింగ్ ఒక యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రమాదం (యాక్సిడెంట్) తర్వాత ఆయన తన గొంతు కోల్పోయారు" అని భావన అరోరా అనే మనో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు.
"ఈ సినిమాలో కాంగ్రెస్ పార్టీని విలన్‌లా చూపించారు. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుంది. మళ్లీ మోదీ ప్రభుత్వం వస్తుంది" అని అంకిత్ ప్రభాకర్ యూట్యూబ్‌లో కామెంట్ పెట్టారు.
కొందరు ఈ ట్రైలర్‌లోని కొన్ని దృశ్యాలపై చలోక్తులు రాసి షేర్ చేస్తున్నారు.
"ఇది నకిలీ వార్తలకు మరో దశ" అని కార్తిక్ దుర్యామంద్ విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ట్రైలర్ ద్వారా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించాలని ప్రయత్నిస్తున్నారని సంజూ శర్మ ఆరోపించారు.
"ఈ సినిమా ఎన్నికల సమయంలో వస్తోంది. కానీ, అది ఓటర్లను ప్రభావితం చేయలేదు" అని ఇక్రమ్ పటేల్ అన్నారు.
ఈ ట్రైలర్‌లోని అనుపమ్ ఖేర్ గొంతును ప్రశంసిస్తూ.. "మీ గొంతు అద్భుతం. దానికి డాక్టర్. మన్మోహన్ సింగ్ డబ్బింగ్ చెప్పారా ఏంటీ?" అని వెంకటేశ్ అనే మరో నెటిజన్ రాశారు.
"క్షమించండి. మీరు మన్మోహన్ సింగ్‌ను చూపించిన తీరు బాలేదు" అని ప్రతీత్ సేన్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- పీవీ నరసింహారావు.. ‘నిశ్శబ్దంగా దేశానికి మేలు చేసిన ప్రధానమంత్రి’
- బాబ్రీ మసీదు విధ్వంసాన్ని పీవీ నరసింహారావు ఎందుకు ఆపలేదు?
- మోదీ అయినా, మన్మోహన్ అయినా ఈ 120 మందికి మాత్రం అన్నీ ‘అచ్ఛే దిన్’లే
- ఓవర్ అయినా.. హ్యాంగోవర్ ఉండదు!
- కాలు లేదు. కేన్సరుంది. అయినా ఇంగ్లిష్ చానల్ ఈదటానికి సై
- మీ పిల్లలను ఏ భాషలో చదివిస్తారు? మాతృభాషలోనా.. లేక ఇంగ్లిష్‌లోనా
- మహిళల్లో 'సున్తీ': పలు దేశాల్లో నిషేధించినా భారత్‌లో ఎందుకు కొనసాగుతోంది?
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










