తెలంగాణ ఎన్నికలు 2018: యూనివర్సిటీ విద్యార్థుల గుండె చప్పుడు వినిపించిన 'బీబీసీ క్యాంపస్ టాక్'

బీబీసీ క్యాంపస్ టాక్
ఫొటో క్యాప్షన్, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో బీబీసీ క్యాంపస్ టాక్
    • రచయిత, పసునూరు శ్రీధర్‌బాబు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణ ఉద్యమంలో ఎంతో చైతన్యంగా కదం కదిపిన విశ్వవిద్యాలయాల విద్యార్థుల మనోగతం ఇప్పుడెలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేసింది 'బీబీసీ న్యూస్ తెలుగు'. అందులో భాగంగానే రాష్ట్రంలోని నాలుగు యూనివర్సిటీలకు వెళ్ళి అక్కడి విద్యార్థులతో 'క్యాంపస్ టాక్' కార్యక్రమాన్ని నిర్వహించి, నాలుగేళ్ళ పాలన మీద వారి ప్రతిస్పందనను ఆవిష్కరించింది.

తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీలు ఎంతో కీలక పాత్ర పోషించాయి. ఉద్యమానికి వ్యూహ కేంద్రాలుగా, పోరాట క్షేత్రాలుగా మారిపోయాయి. అంతేకాదు, ఉద్యమాన్ని చారిత్రకంగా మలుపు తిప్పిన ఘనత కూడా తెలంగాణలోని యూనివర్సిటీలకే దక్కుతుంది.

ప్రజా ఉద్యమాలతో మమేకం కావడం తెలంగాణ విద్యా సంస్థల సంస్కృతిగా మారిపోయిందన్నది చారిత్రక సత్యం. తెలంగాణ రైతాంగ పోరాటం, గ్రంథాలయోద్యమాల నుంచి తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల దాకా ఈ చైతన్యం ఒక ప్రవాహంలా కొనసాగింది. విశ్వవిద్యాలయాలే వేదికగా ఇక్కడ ఎన్నో ఆందోళనలు ప్రజా పోరాటాల స్థాయి నుంచి రాజకీయ ఉద్యమాలుగా రూపాంతరం చెందాయి. విలువైన విజయాలను సొంతం చేసుకున్నాయి.

యూనివర్సిటీ విద్యార్థులు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏకమై చలో అసెంబ్లీ, విద్యార్థి గర్జన వంటి కార్యక్రమాలతో ఆందోళన బాట పట్టారు. లాఠీ చార్జీలు, రబ్బర్ బులెట్లు, టియర్ గ్యాస్ పొగలు క్యాంపస్‌లో మామూలైపోయిన సందర్భంలో ప్రాణాలను లెక్క చేయకుండా విద్యార్థులను ముందుకు నడిపించిన అంశాలు మూడే మూడు. అవి.. నీళ్ళు, నిధులు, నియామకాలు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 1
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 1

మరి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వచ్చిన తరువాత వారి ఆశలు, ఆకాంక్షలు ఎంతవరకు ఫలించాయి?

ఉద్యమ ఫలంగా ఆవిర్భవించిన తెలంగాణలో ప్రభుత్వ పాలన ఉద్యమ సూర్తితో సాగిందా? ఉద్యమ ఆకాంక్షలను నిజం చేసే దిశలోనే అడుగులు వేస్తోందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో యూనివర్సిటీ విద్యార్థుల గుండె చప్పుడు ఎలా ఉంది?

ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు, సమాజ నిర్మాణానికి వెన్నెముక లాంటి యువతరం మనోగతాన్ని ఆవిష్కరించేందుకు బీబీసీ న్యూస్ తెలుగు 'క్యాంపస్ టాక్' కార్యక్రమాన్ని నాలుగు యూనివర్సిటీలలో నిర్వహించింది. మొదటి క్యాంపస్ టాక్ కార్యక్రమాన్ని నవంబర్ 24న కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీలో నిర్వహించాం. ఆ తరువాత వరంగల్‌లోని కాకతీయ, నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలకు వెళ్లింది క్యాంపస్ టాక్. చివరగా, నవంబర్ 30న హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల మనోగతాన్ని వినిపించి... వారు ఏం కోరుకుంటున్నారో తెలిపే ప్రయత్నం చేసింది బీబీసీ న్యూస్ తెలుగు.

ఫేస్‌బుక్, యూట్యూబ్‌ మాధ్యమాలలో ప్రసారమైన 'క్యాంపస్ టాక్' లైవ్ షోలో విద్యార్థులు తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొందరు మెచ్చుకున్నారు. తెలంగాణ వచ్చిన తరువాత ఆసరా, కల్యాణ లక్ష్మి, కంటి వెలుగు వంటి పథకాలు పేద ప్రజలకు మేలు చేశాయని చెప్పారు. రైతు బంధు పథకం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఉద్యోగ నియామకాల్లో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. చాలా మంది విద్యార్థులు గొర్రెల పంపిణీ వంటి పథకాలను కుల వ్యవస్థను, వివక్షను కొనసాగించే భూస్వామ్య స్వభావంగానే చూస్తున్నారు. ముఖ్యంగా, ప్రజలు కోరుకుంటున్న దానికి, ప్రభుత్వం చేస్తున్నదానికి మధ్య అంతరాలు ఎలా ఉన్నాయో ఆవిష్కరించింది క్యాంపస్ టాక్.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 2
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 2

"మలి దశ ఉద్యమంలో కెరీర్‌ను పణంగా పెట్టి పద్నాలుగేళ్ళు పోరాడిన విద్యార్థి లోకానికి ప్రత్యేక తెలంగాణ వల్ల ఆశించిన ప్రయోజనం కలగలేదు" అని నాలుగు యూనివర్సిటీల విద్యార్థులు అన్నారు. ఉద్యమాన్ని నడిపించిన మూడు కీలకాంశాలలో ఒకటైన "నియామకాల" పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపించలేదన్నది విద్యార్థుల ప్రధాన ఆరోపణ.

"లక్ష ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏవో కొన్ని ఇచ్చారు. టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లకే పరిమితమైంది. డీఎస్సీ ఊసే లేదు. మొదటి ఏడాదిలోనే నియామకాలు జరిగి ఉంటే మా కుటుంబాలు ఎంతో బాగు పడేవి" అని కొందరు అంటే, "ఉద్యోగాలు ఇవ్వండి, నిరుద్యోగ భృతి కాదు" అని కొందరన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎందుకు ఎదురు చూస్తున్నారు, ఐటి, ఫార్మా వంటి ప్రైవేట్ రంగాల వైపు ఎందుకు చూడడం లేదని అడిగినప్పుడు, "ప్రైవేటు సంస్థలు క్యాంపస్ నియామకాల కోసం మా యూనివర్సిటీల వైపు చూసే పరిస్థితులు ఇప్పుడు లేవు" అని వారు బదులిచ్చారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 3
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 3

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మెరుగ్గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో నియామకాలు (Hiring Activity) అత్యల్ప శాతానికి పడిపోయాయి. దేశవ్యాప్తంగా ఉన్న హైరింగ్ యాక్టివిటీలో తెలంగాణ వాటా 2.24 శాతంగా ఉందని 'ఇండియా స్కిల్స్ రిపోర్ట్' (ISR-2018) నివేదిక చెబుతోంది. ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనలో మహారాష్ట్ర (16.51%), ఢిల్లీ (13.58%), తమిళనాడు (10.58%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. అందుకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులకు, ఉద్యోగాల కల్పనకు సంబంధం ఉంటుందనుకోవడానికి వీల్లేదని నిపుణులు చెబుతున్నారు.

అందుకే, హైదరాబాద్, వరంగల్‌లలోని యూనివర్సిటీ విద్యార్థులు ప్రైవేటు రంగంలోని ఉద్యోగావకాశాల పట్ల కూడా నిరాసక్తత వ్యక్తం చేశారు.

"వరంగల్‌ను హైదరాబాద్ తరువాత రెండో ఐటి హబ్ గా మార్చుతామని హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీకి సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవు" అని విద్యార్థులు అన్నారు.

నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు, "ప్రభుత్వం సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తోంది. లబ్ధిదారులకు నేరుగా ప్రయోజనం అందుతోంది. ఆ విషయంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వం ఎంతో మెరుగ్గా ఉంద"ని చెప్పారు.

ఇరవై నాలుగు గంటల విద్యుత్ పంపిణీని విద్యార్థిలోకం కూడా తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయంగా చూస్తోంది. ప్రాజెక్టుల నిర్మాణం గురించి, మిషన్ కాకతీయ, భగీరథల గురించి విద్యార్థులు బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి, 4
Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of YouTube ముగిసింది, 4

ముఖ్యంగా, "రైతు బంధు పథకానికి గరిష్ట భూపరిమితి విధించకపోవడం హేతుబద్ధంగా లేదు" అని చాలా మంది విద్యార్థులు అభిప్రాయపడ్డారు. "ఒకటి రెండు ఎకరాలు ఉన్నవారికి ఈ పథకం కింద వచ్చే డబ్బులు ఖర్చులకు సరిపోతుంటే, ఎకరాలు ఎకరాలు ఉన్న వారు మాత్రం ఉచితంగా అందుతున్న చెక్కులతో ట్రాక్టర్లు, జీపులు కొనుక్కుని తిరుగుతున్నారు" అనే విమర్శ విద్యార్థుల నోట బలంగా వినిపించింది.

మిమ్మల్ని అన్నింటికన్నా ఎక్కువగా వేధిస్తున్న సమస్య ఏమిటి? ఎన్నికల తరువాత ఏర్పడే ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటున్నది ఏమిటని ప్రశ్నించినప్పుడు, యూనివర్సిటీల విద్యార్థులందరూ ఒక్కటై చెప్పిన ఒకే ఒక్క మాట:

"ఉద్యోగ నియామకాలు."

"లక్ష ఉద్యోగాలతో పాటు ఈ నాలుగేళ్ళలో రిటైరైన 50 వేలకు పైగా ఉద్యోగాలను కలిపి వెంటనే అన్ని రంగాలలో నియామకాలు వేగంగా పూర్తి చేయాలి" అని వారు కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)