#మీటూ: ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ వ్యవహారాలశాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ పాత్రికేయ వృత్తిలో ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు, యుక్త వయసులోని మహిళలను 'సమావేశాల' కోసం హోటల్ గదులకు రమ్మన్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఆయన గతంలో ద టెలిగ్రాఫ్, ది ఏషియన్ ఏజ్, ఇతర పత్రికలకు ఎడిటర్‌గా పనిచేశారు.
అక్బర్ మీద వచ్చిన ఆరోపణలపై ఆయనగాని, విదేశీ వ్యవహారాలశాఖగాని ఇప్పటివరకు స్పందించలేదు.
రాజకీయ నాయకులు సహా ఈ ఆరోపణలను ఎదుర్కొంటున్న అందరిపైనా విచారణ జరపాలని కేంద్ర మంత్రి మనేకా గాంధీ కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
లైంగిక వేధింపులకు సంబంధించి భారత్‌లో కొన్ని రోజులుగా సినీ ప్రముఖులు, హాస్యనటులు, నటులు, పాత్రికేయులు, రచయితలపై పలువురు మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. దీనిని భారత #MeToo ఉద్యమంగా పిలుస్తున్నారు.
ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉన్నతస్థాయి వ్యక్తుల్లో అక్బర్ ఒకరు. మొదటిసారిగా సోమవారం సీనియర్ పాత్రికేయురాలు ప్రియా రమానీ ఆయనపై ఆరోపణలు చేశారు.
హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టీన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, నిరుడు 'టు ద హార్వే వెయిన్‌స్టీన్స్ ఆఫ్ ద వరల్డ్' శీర్షికతో 'వోగ్ ఇండియా'కు తాను రాసిన ఒక వ్యాసాన్ని ఆమె ట్వీట్ చేశారు.
పని ప్రదేశంలో తనకు ఎదురైన తొలి లైంగిక వేధింపు ఇదేనంటూ ఒక ఘటనను ఆమె ఈ వ్యాసంలో గుర్తుచేసుకున్నారు.
వ్యాసంలో ప్రియా రమానీ ఎవరి పేరునూ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే వ్యాసం అక్బర్ గురించేనని ఆమె సోమవారం ట్వీట్ చేశారు.
తర్వాత మరో ఐదుగురు మహిళలు తమనూ లైంగిక వేధింపులకు గురిచేశారంటూ అక్బర్‌పై ఆరోపణలు చేశారు. తన వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతూ మరో మహిళ కూడా ఆరోపణలు చేశారు. ఇవి అక్బర్‌ను ఉద్దేశించినవేనని భావిస్తున్నారు.
సీనియర్ నటుడు అలోక్ నాథ్, సినీ దర్శకుడు వికాస్ బహల్‌పైనా ఆరోపణలు వచ్చాయి. వీటిని అలోక్ ఖండించారు. వికాస్ వీటిపై స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- #MeToo: ఏది వేధింపు? ఏది కాదు?
- తనుశ్రీ దత్తా ఆరోపణలపై స్పందించిన నానా పాటేకర్
- స్త్రీ గౌరవం రెండు కాళ్ల మధ్య లేదు : బీబీసీ ఇంటర్వ్యూలో రేణూ దేశాయ్
- ఇచట వృద్ధులకు పెళ్లిళ్లు చేయబడును!
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంతో మరింత పేదరికంలోకి ప్రపంచం: ఐఎంఎఫ్
- జన్యుపరీక్ష: ‘రూ.4వేలతో మీకు ‘గుండెపోటు’ వస్తుందా లేదా ముందే తెలుసుకోవచ్చు’
- ‘టాలీవుడ్లో హీరోయిన్లకు వేధింపులు ఇలా ఉంటాయ్!‘
- #BollywoodSexism: బాలీవుడ్లో లైంగిక వేధింపులు ఎలా ఉంటాయంటే..
- అనుపమా పరమేశ్వరన్ : కాలేజీ రోజుల్లో నన్నూ వేధించారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








