ఒకే కుటుంబం.. ఒకే జిల్లా.. మూడు ప్రమాదాలు

హరికృష్ణ

నల్గొండ జిల్లాలో నందమూరి కుటుంబం మూడు ప్రమాదాల్లో చిక్కుకుంది. 2014 డిసెంబర్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ మరణించారు.

అప్పటి వార్తల ప్రకారం.. ఈ రోడ్డు ప్రమాదం హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా రోడ్డు మలుపులో రాంగ్ రూట్‌లో వచ్చిన ట్రాక్టర్‌ ఢీకొనడంతో దుర్ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో జానకి రామ్‌తోపాటు కారు డ్రైవర్ కూడా ఉన్నారు. కానీ కారును మాత్రం జానకిరామ్ నడుపుతున్నట్టు చెబుతున్నారు.

ఇదే నల్గొండ జిల్లా మోతె సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో జూ.ఎన్టీఆర్ గాయాలతో బయటపడ్డారు.

వీడియో క్యాప్షన్, వీడియో: హరికృష్ణ దుర్మరణం

2009 మార్చి 26న జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకుని హైదరాబాద్‌కు తిరిగి వెళుతుండగా, రాత్రి వేళ మోతె మండల కేంద్రం సమీపంలోని తిరుతమ్మగుడి మూలమలుపు వద్ద ఆయన ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

ఈ ఘటనలో జూనియర్ ఎన్టీఆర్‌తో సహా పలువురికి గాయాలు కాగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

తాజాగా హరికృష్ణ హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వెళ్తుండగా.. ఈ ప్రమాదం జరిగింది.

నల్గొండ జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో అన్నేవర్తి వద్ద హరికృష్ణ వెళ్తున్న కారు ప్రమాదానికి గురై ఆయన మరణించారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)