రాజస్థాన్ పష్తోలు: మేం ముస్లింలం కాదు.. హిందువులం, భారతీయులం!

పాకిస్తాన్ నుంచి 70 ఏళ్ల కిందట పష్తూన్ వర్గం వాళ్లు భారత్‌కు వలస వచ్చారు. వీళ్లలో ఎక్కువ మంది రాజస్థాన్‌లోనే స్థిరపడ్డారు. ఇన్నేళ్ల నుంచి భారత్‌లోనే ఉంటున్నా వీళ్లకు సరైన గుర్తింపు లేదు.
స్థానికులతో కలిసిపోవడానికి తమ సంస్కృతీ సంప్రదాయాలను వదిలిపెట్టాల్సి వచ్చిందని వీళ్లు బాధపడతారు. తమ వేషధారణ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయనీ, దాంతో తమను ముస్లింలుగా భావించి స్థానికులు తమతో కలవడానికి ఇష్టపడరనీ వీళ్లు చెబుతారు.
పిల్లలతో పష్తో భాషలో మాట్లాడటానికి కూడా వీళ్లు ఇష్టపడట్లేదు. తమ భాషలో మాట్లాడితే నవ్వుతున్నారనీ, హేళన చేస్తున్నారనీ అంటున్నారు.
తమ ఆచారం ప్రకారం వీళ్లు ముఖంపై పచ్చబొట్లు వేయించుకుంటారు. దీన్ని షీన్‌ఖలై అని పిలుస్తారు. ఆ పచ్చబొట్ల వల్ల వీళ్లు ఇతరులకంటే భిన్నంగా కనిపిస్తున్నారు.
ఎన్ని సమస్యలొచ్చినా కొందరు పష్తోలు మాత్రం తమ సంస్కృతీ సంప్రదాయాలను భద్రంగా కాపాడుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
- జుకర్బర్గ్: ‘భారతదేశపు ఎన్నికల్లో మోసాలకు తావు లేకుండా చూస్తాం’
- తండ్రిని ఆకలి ఓడించింది, ఆ తండ్రిని కొడుకు గెలిపించాడు.. రాహుల్ 'గోల్డ్' కోస్ట్ స్టోరీ ఇదీ!
- #BBCShe: వితంతు పింఛన్లలో కానరాని ‘గుజరాత్ అభివృద్ధి’
- డోక్లాం: భారత్, చైనా మధ్యలో భూటాన్! ఇంతకీ భూటాన్ ప్రజలేమనుకుంటున్నారు?
- ‘అప్పుడు అంబేడ్కర్ పేరు పలకడానికి సిగ్గుపడేదాన్ని.. ఇప్పుడు గర్వపడుతున్నా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





