#LIVE: సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ప్రెస్‌మీట్..

ఫొటో సోర్స్, Supreme Court
జస్టిస్ చలమేశ్వర్ నివాసంలో నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ మదన్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ సమావేశం అయ్యారు. న్యాయ వ్యవస్థను సంరక్షించుకోలేకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం విఫలం అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను సమావేశానికి పిలిచిన సీజేఐ దీపక్ మిశ్రా
న్యాయమూర్తులు దీపక్ మిశ్రాకు పంపినట్లు పేర్కొంటూ విడుదల చేసిన లేఖ ప్రతి తెలుగులో త్వరలో..
ఈ పరిణామంపై ఇతర లైవ్ అప్‌డేట్స్
- ఇది సుప్రీం కోర్టు అంతర్గత విషయం. త్వరలోనే పరిస్థితులు చక్కబడతాయి. ప్రభుత్వం - సీఎన్ఎన్ న్యూస్ 18 రిపోర్ట్
- కాపేట్లో అటార్నీజనరల్ కేకే వేణుగోపాల్‌ను కలవనున్న చీప్ చస్టిస్ దీపక్ మిశ్రా (న్యూస్ 18 రిపోర్ట్)
అంతకు ముందు.. మీడియా సమావేశంలో న్యాయమూర్తులు ప్రస్తావించిన అంశాలు
12.30pm : అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిర్వహణ దాని ప్రమాణాలకు తగినట్లుగా లేదు. - జస్టిస్ చలమేశ్వర్
12.29pm : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ విషయంపై మాట్లాడినా ఫలితం లేకపోయింది. - జస్టిస్ చలమేశ్వర్
12.28pm : గత్యంతరం లేక, వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు మీడియా ముందుకు వచ్చాం. - జస్టిస్ చలమేశ్వర్
12.27pm : ఆత్మలను అమ్ముకున్నామని కొందరు చెప్పే పరిస్థితి రాకూడదు. - జస్టిస్ చలమేశ్వర్
12.24pm : సుప్రీంకోర్టులో పాలన సరిగా లేదు - జస్టిస్ చలమేశ్వర్
12.23pm : జరుగుతున్న పరిణామాలను ప్రజలకు తెలియజేయడం మినహా మాకు మరో మార్గం లేదు - జస్టిస్ చలమేశ్వర్
12.20pm దేశ చరిత్రలో న్యాయమూర్తులు తొలి మీడియా సమావేశం ఇది - జస్టిస్ చలమేశ్వర్
12.18pm సుప్రీంకోర్టులో కొద్దినెలలుగా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. - జస్టిస్ చలమేశ్వర్
ఇవి కూడా చదవండి
(ఈ అంశంపై మరిన్ని అప్‌డేట్‌ల కోసం బీబీసీ తెలుగును చూస్తూ ఉండండి)








