సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇంటిని లూటీ చేసిన జనం

వీడియో క్యాప్షన్, Video: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇంటిని జనం ఎలా లూటీ చేశారో చూడండి..
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ ఇంటిని లూటీ చేసిన జనం

సిరియా రాజధాని డమాస్కస్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్- అసద్ నివసించిన ప్యాలెస్ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలను ప్రజలు లూటీ చేస్తున్నారు.

బషర్ అల్-అసద్ దేశం విడిచి పారిపోవడంతో ఆయన ఇంటిని ప్రజలు లూటీ చేశారు. చేతికి దొరికింది పట్టుకుని పారిపోయారు.

తాము పదేళ్ల తర్వాత ఇక్కడికి వచ్చామని బీబీసీ ప్రతినిధి తెలిపారు. ఈ సారి తాము అరెస్ట్ అవుతామన్న భయం లేకుండా ఇక్కడికి రాగలిగామని చెప్పారు.

బషర్ అల్-అసద్ ఇంటిని జనం ఎలా లూటీ చేశారో ఈ వీడియోలో చూడొచ్చు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)