బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య.. ప్రభుత్వం ఏం చెప్పింది?

వీడియో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య.. ప్రభుత్వం ఏం చెప్పింది?
బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య.. ప్రభుత్వం ఏం చెప్పింది?

బంగ్లాదేశ్‌లో విద్యార్థి నేత ఉస్మాన్ హాదీ మృతి తర్వాత చెలరేగిన హింసతో భారత్‌పై వ్యతిరేక భావనలు మరింత పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.

గత ఏడాది షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఆందోళనల్లో ప్రధాన పాత్ర పోషించిన ఇంక్విలాబ్ మంచ్‌కు చెందిన ఉస్మాన్ హాదీపై గత వారం కాల్పులు జరిగాయి. ఆయన డిసెంబర్ 18, గురువారంనాడు చనిపోయారు.

ఆ తర్వాత ఢాకాలో పెద్ద ఎత్తున జరిగిన ప్రదర్శనలు హింసామార్గం పట్టాయి. ఆందోళనాకారులు ప్రథమ్ ఆలో, డెయిలీ స్టార్ వార్తా పత్రికల కార్యాలయాలను ధ్వంసం చేసి నిప్పు పెట్టారు.

గురువారం రోజునే ఒక హిందూ యువకుడిని కొట్టి హత్య చేసిన ఘటన జరిగింది. తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న బంగ్లాదేశ్ జమాతే ఇస్లామీ ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది.

దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

బంగ్లాలో హిందూ యువకుని హత్య

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)