తెలంగాణ: ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్, ప్రమాద తీవ్రత 11 ఫోటోలలో

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీ కొట్టిన ఘటనలో 19 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో 14మంది మహిళలు, నలుగురు పురుషులు, ఒక పసికందు ఉన్నారని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి చెప్పారు.

బస్సులో 72 మంది ఉన్నట్లు కండక్టర్ తెలిపారని తెలంగాణ ఏడీజీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)