దిల్లీలో పేలుడు: తుక్కుతుక్కు అయిన కార్లు
దిల్లీలో పేలుడు: తుక్కుతుక్కు అయిన కార్లు
దేశ రాజధాని దిల్లీలో సోమవారం సాయంత్రం పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 8 మంది మృతి చెందినట్లు కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షా చెప్పారు.
దిల్లీలో ఎర్రకోట దగ్గర సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఒక హ్యుండాయ్ ఐ 20 కారులో పేలుడు జరిగింది. పేలుడు వల్ల కారులో, ఆ కారు చుట్టుపక్కల ఉన్న మూడు నాలుగు వాహనాల్లో ఉన్నవారు, నిలబడినవారు, ఆటోలో కూర్చున్నవారు గాయపడ్డారు. కొందరు చనిపోయారు. ఆస్పత్రి వర్గాల వివరాల ప్రకారం ఇప్పటివరకూ 8 మంది చనిపోయారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









