తెలంగాణ: చెరువులో కట్టిన ఇల్లు, ఎలా కూల్చేశారంటే....

వీడియో క్యాప్షన్, తెలంగాణ: చెరువులో కట్టిన ఈ ఇంటిని ఎలా కూల్చేశారంటే....
తెలంగాణ: చెరువులో కట్టిన ఇల్లు, ఎలా కూల్చేశారంటే....
    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామ చెరువులో నిర్మించిన ఈ భవనాన్ని అధికారులు మందుగుండు తో పేల్చివేశారు.

చెరువులో అక్రమ నిర్మాణం చేపట్టారని మల్కాపూర్‌కు చెందిన కొందరు రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

గ్రామస్థుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రెండు శాఖల అధికారులు ఈ నిర్మాణాన్ని కూల్చివేయాలని నిర్ణయించారు. అక్రమ నిర్మాణం కావడం, యంత్రాలతో కూల్చేందుకు అనువుగా లేకపోవడంతో జిలెటిన్ స్టిక్స్ అమర్చి పేల్చేసినట్లు అధికారులు చెప్పారు.

పేల్చివేత సమయంలో పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)