పిఠాపురంలో పోలింగ్ రోజు ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 23.10 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది.
ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ పోటీ చేస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో 31.06 శాతం పోలింగ్ నమోదైంది.
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 22.56 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం నియోజకవర్గంలో 26.47 శాతం ఓటింగ్ నమోదైనట్లు చెప్పింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు 24.31 శాతం పోలింగ్ నమోదైంది.
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో మధ్యాహ్నం 11 గంటల వరకు 16.34 శాతం ఓటింగ్ నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ సరళిపై వివిధ ప్రాంతాల నుంచి బీబీసీ ప్రతినిధిలు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి మా ప్రతినిధి బళ్ల సతీష్ అందిస్తున్న రిపోర్టు ఇది.
మరిన్ని తాజా అప్‌డేట్స్ కోసం లైవ్ పేజీ చూడండి.
ఇవి కూడా చదవండి:
- ‘మా నాన్న సీఎం’
- Northern Lights: ఆకాశంలో ఈ రంగుల తుపాను మీకెప్పుడైనా కనిపించిందా?
- ఎన్నికల కోడ్ అంటే ఏంటి? ఇది అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?
- ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: ఒకసారి గెలిచిన వారికి మరో చాన్స్ ఇవ్వని నియోజకవర్గం, ఇక్కడే ఎందుకిలా జరుగుతోంది?
- గాజువాక ఎన్నికలు ఎందుకంత ప్రత్యేకం?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









