ఆంధ్రప్రదేశ్‌లో 68.12 శాతం పోలింగ్ నమోదు - ఎన్నికల సంఘం

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 68.12 శాతం పోలింగ్ నమోదైంది. పూర్తి సమాచారం అందిన తర్వాత పోలింగ్ శాతాల్లో మార్పులు ఉండొచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది. దేశవ్యాప్తంగా నాలుగో దశలో 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం పోలింగ్ జరిగింది.

లైవ్ కవరేజీ

  1. ధన్యవాదాలు

    బీబీసీ న్యూస్ తెలుగు లైవ్ పేజీ అప్‌డేట్లను ఇంతటితో ముగిస్తున్నాం.

  2. ముంబాయిలో దుమ్ము తుపాను, ముగ్గురి మృతి, 54మందికి గాయాలు

    కూలిన హోర్డింగ్

    ఫొటో సోర్స్, REUTERS

    ముంబాయిలో సోమవారం హఠాత్తుగా విరుచుకుపడిన భారీవర్షం, పెద్ద ఎత్తున ఎగసిపడిన దుమ్ము కారణంగా అనేక చోట్ల హోర్డింగ్‌లు కూలిపోయాయి.

    ఘట్‌కోపర్ ప్రాంతంలో హోర్డింగ్ విరిగిపడటంతో ముగ్గురు మృతి చెందారు. 54మంది గాయపడ్డారు.

    ఈ శిథిలాల కింద ఇంకా వందిమందిదాకా చిక్కుకుని ఉంటారని అధికారులు తెలిపారు.

    ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద ఉన్న బీబీసీ కరస్పాండెంట్ దీపాలి జగ్తాప్ సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

    ముంబాయి అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలి వద్దే ఉన్నారు.

    బృహన్ ముంబాయి కార్పొరేషన్ అధికారులు చెప్పిన వివరాలమేరకు ఘట్‌కోపర్ ప్రాంతంలోని రద్దీగా ఉండే ఈస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవే సమీపంలో ఈ సంఘటన జరిగింది.

    క్షతగాత్రులను దగ్గరలోని రాజ్‌వాడీ ఆస్పత్రికి తరలించారు.

  3. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 68.12 శాతం పోలింగ్ - ఎన్నికల సంఘం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం సుమారు 68.12 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం పేర్కొంది.

    ఓటర్ టర్నవుట్ యాప్‌లో ఈ వివరాలు వెల్లడించింది.

    ఇక తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో 61.39 శాతం పోలింగ్ నమోదైంది.

    పూర్తి సమాచారం అందిన తర్వాత పోలింగ్ శాతాల్లో మార్పులు ఉండొచ్చని ఎన్నికల సంఘం పేర్కొంది.

    ఓటింగ్

    ఫొటో సోర్స్, ECI

  4. మాధవీలతపై కేసు ఎందుకు పెట్టారు, అసలేం జరిగింది?

  5. వేరే అభ్యర్థికి ఓటేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఏం జరిగిందంటే...

  6. ఏపీలో సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో సాయంత్రం 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదైంది.

    తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది.

    తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 47.88 శాతం ఓటింగ్ నమోదైంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06 శాతం.. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 57.42 శాతం పోలింగ్ నమోదైంది.

  7. ఆంధ్రప్రదేశ్‌: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత, శంకర్, బీబీసీ కోసం

    నరసరావుపేటలో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి యత్నించిన టీడీపీ శ్రేణులు

    ఫొటో సోర్స్, ugc

    ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఉద్రిక్తత

    ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

    సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి ప్రయత్నించాయి.

    అంతకుముందు టీడీపీ అభ్యర్ధి చదలవాడ అరవింద బాబు కారుపై వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు దాడి చేశారు. దానికి ప్రతిగా టీడీపీ శ్రేణులు ఈ పని చేశారని చూసిన వాళ్లు చెబుతున్నారు.

    పోలింగ్ సందర్భంగా ఉదయం నుంచి నరసరావుపేట నియోజకవర్గంలో పలు హింసాత్మక ఘటనలు జరిగాయి.

    టీడీపీ ఎంపీ అభ్యర్ధి లావు శ్రీ కృష్ణదేవరాయలుకు చెందిన మూడు కార్లను అధికార పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.

    మధ్యాహ్నాం తర్వాత ఈ దాడులు, ప్రతి దాడులు తీవ్రమయ్యాయి. ఎమ్మెల్యే ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు గుమికూడడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.

    వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా పోటీగా రంగంలో దిగడంతో పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళన వ్యక్తమయింది. చివరికి ప్రత్యేక పోలీసు బలగాల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

  8. మనిషికి పంది కిడ్నీ అమర్చిన రెండు నెలల్లోనే విషాదం

  9. ఆంధ్రప్రదేశ్‌లో మూడు నియోజకవర్గాలలో ముగిసిన పోలింగ్

    175 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్‌లో మూడు నియోజకవర్గాలలో పోలింగ్ ముగిసింది.

    అరకు, పాడేరు, రంపచోడవరం అసెంబ్లీ స్థానాల పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో 4 గంటలతో పోలింగ్ ముగిసింది.

    అయితే, సాయంత్రం 4 గంటల సమయానికి క్యూ లైన్లలో ఉన్నవారికి మాత్రం ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు.

    మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో ఈ మూడు నియోజకవర్గాలలో ముందుగానే పోలింగ్ ముగించారు.

  10. ఏపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్

    బారులు తీరిన ఓటర్లు

    మధ్యాహ్నం 3 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 55.49 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు 52.34 శాతం పోలింగ్ నమోదైంది.

    తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో మధ్యాహ్నం 3 గంటల వరకు 39.92 శాతం ఓటింగ్ నమోదైంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుజిల్లాలో అత్యధికంగా 61.94 శాతం.. విశాఖ జిల్లాలో అత్యల్పంగా 46.01 శాతం పోలింగ్ నమోదైంది.

  11. RCB-CSK: IPL ప్లేఆఫ్స్‌లో స్థానం కోసం ఆర్సీబీ వ్యూహం ఏంటి?

  12. గన్నవరంలో ఉద్రిక్తత, రాళ్లు రువ్వుకున్న వైఎస్ఆర్సీపీ, టీడీపీ శ్రేణులు

    గన్నవరంలో ఘర్షణ

    ఫొటో సోర్స్, UGC

    కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం లో ఉద్రిక్తత ఏర్పడింది. పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్ఆర్సీపీ, టీడీపీ కార్యకర్తలు ఘర్షణలకు దిగారు. రాళ్లు రువ్వుకున్నారు. ముస్తాబాద్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఈ వివాదం జరిగింది.

    వైఎస్సార్సీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకటరావు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో ఇరు వర్గాలు ఎదురు పడ్డారు.

    ఆ సమయంలోనే అభ్యర్ధుల సమక్షంలో కార్యకర్తలు తలపడడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నాయకులను అక్కడి నుంచి తరలించారు. కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చినట్టు వెల్లడించారు.

  13. మాధవీలత: హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిపై మలక్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు

    Kompella Madhavi Latha

    ఫొటో సోర్స్, Kompella Madhavi Latha

    హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై మలక్‌పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

    ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 171సీ, 186, 505(1)(సీ)తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం ఆమెపై మలక్‌పేట స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ట్విటర్ వేదికగా వెల్లడించారు.

    కాగా తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలోని ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆమె అక్కడ ముస్లిం మహిళా ఓటర్ల ఐడీలు, బురఖా తొలగింపజేసి వారి ముఖాలు తనిఖీ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించింది.

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 1

    పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది, 2

  14. కడప జిల్లాలో ఓటింగ్ సరళి ఎలా ఉంది? - బీబీసీ ప్రతినిధి అమరేంద్ర LIVE

    కడప లోక్‌సభ నియోజకర్గంలో జమ్మలమడుగులో ఓటింగ్ సరళి ఎలా ఉంది? బీబీసీ ప్రతినిధి అమరేంద్ర వివరిస్తున్నారు..

  15. అర్ధశతాబ్దం తర్వాత చంద్రుడిపై కాలుమోపేదెవరు, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి?

  16. మధ్యాహ్నం ఒంటి గంటకు ఏపీలో 40.26 శాతం పోలింగ్ - తెలంగాణలో 40.38 శాతం

    తెలంగాణలోని సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్లు

    ఫొటో సోర్స్, Praveen Shubham/BBC

    ఫొటో క్యాప్షన్, తెలంగాణలోని సిద్దిపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్‌జెండర్లు

    మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 40.26 శాతం పోలింగ్ నమోదైంది. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు 40.38 శాతం పోలింగ్ నమోదైంది.

    తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 29.03 శాతం ఓటింగ్ నమోదైంది.

    ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లాలో అత్యధికంగా 45.56 శాతం.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 32.82 శాతం పోలింగ్ నమోదైంది.

  17. పిఠాపురంలో పోలింగ్ సరళిపై బీబీసీ ప్రతినిధి బళ్ల సతీశ్ లైవ్

    పోస్ట్‌ YouTube స్కిప్ చేయండి
    Google YouTube ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు. YouTube ఈ సమాచారంలో ప్రకటనలు ఉండొచ్చు.

    పోస్ట్ of YouTube ముగిసింది

  18. పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే, యువకుడి మధ్య ఘర్షణ - చెంప దెబ్బలు, శంకర్ వడిశెట్టి, బీబీసీ కోసం

    తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, యువకుడి మధ్య ఘర్షణ

    ఫొటో సోర్స్, UGC

    తెనాలి పట్టణంలోని పోలింగ్ బూత్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, జనసేన అభ్యర్థి మద్దతుదారుల మధ్య ఘర్షణ జరిగింది.

    ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరులు పోలింగ్ బూత్ లోకి వెళుతుండగా కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో రెండువర్గాల వాగ్వాదం జరిగింది.

    ఆ క్రమంలో ఎమ్మెల్యే శివకుమార్ ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. దానికి ప్రతిగా ఆ యువకుడు కూడా ఎమ్మెల్యే మీద చేయి చేసుకోవడం ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది.

    ఎమ్మెల్యే తో పాటుగా ఆయన అనుచరులు తనపై దాడి చేసి, గాయ పరిచారు అంటూ ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    కాగా టీడీపీ కార్యకర్తలు మహిళా ఓటర్లను వేధిస్తున్నారన్న సమాచారం రావడంతో అడ్డుకోవడానికి ఎమ్మెల్యే వెళ్లారని, అక్కడ టీడీపీ కార్యకర్తలు శివకుమార్‌ను దూషించడం ఘర్షణకు దారితీసిందంటూ వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

  19. పిఠాపురంలో పోలింగ్ రోజు ఏం జరిగింది?

  20. కేసీఆర్: ఈ ఎన్నికల తరువాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే పవర్

    పోస్ట్‌ X స్కిప్ చేయండి
    X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

    ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

    హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

    పోస్ట్ of X ముగిసింది

    తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా చింతమడకలో ఓటేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల తరువాత దేశంలో ప్రాంతీయ పార్టీలదే అధికారమని ఆయన అన్నారు.

    బీజేపీలో 75 ఏళ్ల తరువాత ఎవరూ ఏ పదవీ చేపట్టకూడదన్న సొంత నిబంధన ఉందని, దాని ప్రకారం మోదీ పదవి నుంచి దిగిపోవాల్సి వస్తుందని అన్నారు.