సింహం పొలంలో.. రైతు బోనులో, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?

వీడియో క్యాప్షన్, పొలంలో సింహం.. బోనులో రైతు
సింహం పొలంలో.. రైతు బోనులో, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?

పొలం మధ్యలో 10 అడుగుల ఎత్తులో ఒక బోను. చుట్టూ చెరకు తోట.

ఈ ఎత్తున కూర్చొని రైతులు పంటనే కాదు.. తమ ప్రాణాలను కూడా రక్షించుకుంటున్నారు.

గుజరాత్‌లోని గిర్ అటవీ ప్రాంతంలో జనాలు తప్పనిసరి పరిస్థితుల్లో బోనులో ఉంటున్నారు.

బోనులో రైతు

సోమనాథ్ జిల్లాలోని అలిదర్ గ్రామానికి చెందిన చేతన్… ఐరన్ గ్రిల్‌తో ఒక బోను తయారు చేసుకున్నారు. పైన ఇనుప రేకులను వేశారు. సింహాల నుంచి తప్పించుకునేందుకు దీనిని తయారు చేసినట్లు ఆయన తెలిపారు.

అటవీ శాఖ లెక్కల ప్రకారం... గత 5 ఏళ్లలో గుజరాత్‌లో సింహాల సంఖ్య 32 శాతానికి పైగా పెరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)